ఒంటిపై నూలుపోగైనా లేకుండా బీచ్ ఇసుకలో స్నానమాడుతోంది!

Thu Jun 17 2021 13:00:55 GMT+0530 (IST)

Kiara Advani Latest Stunning Photoshoot

గత కొద్దిరోజులుగా డబూ రత్నానీ క్యాలెండర్ హంగామా పీక్స్ కి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అందాల నాయికలు కథానాయకుల ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ క్యాలెండర్ నుంచి కియారా అద్వానీ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాల్లోకి వచ్చింది. కియరా వరుసగా డబూ రత్నాని క్యాలెండర్ పై మూడోసారి దర్శనమిచ్చింది. ఈ ముంబై బ్యూటీ ఎవ్వర్ లేటెస్ట్ రూపాన్ని ఫోటోగ్రాఫర్ డబూ తాజాగా ఆవిష్కరించగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.కియారా అద్వానీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ లో అందంగా కనిపిస్తోంది. ఒంటిపై నూలుపోగైనా లేకుండా అలా బీచ్ ఇసుకలో స్నానమాడుతోంది! తన అందమైన కురులు శరీరాన్ని కప్పిపుచ్చాయి. ఫోటోషూట్ కోసం టాప్ లెస్ గా ఫోజులిచ్చింది కియరా. డబూతో వరుస సంవత్సరాల్లో వరుసగా మూడు ఫోటోషూట్లలో పాల్గొనగా.. కియారా ఈ ఏడాది ఫోటోషూట్ తనకు అత్యంత ఇష్టమైనదని పేర్కొంది. ఈ ఫోటోగ్రాఫ్ కి ఆలియా స్పందిస్తూ `వోవా..!` అంటూ వ్యాఖ్యానించింది. ది ఇంటర్నెట్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ ఎగైన్ అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించారు.

2019 ఫోటోషూట్ లో బ్లూ జీన్స్ దానిపై జాకెట్ తో కనిపించిన కియరా.. 2020 క్యాలెండర్ పై ఎలాంటి ఆచ్ఛాదనా లేని తన అందాల్ని ఒక పచ్చని ఆకుతో కప్పుకుని కనిపించింది. ఇప్పుడు కూడా పూర్తి నగ్నరూపంతో కొత్త క్యాలెండర్ ని అలంకరించింది.

బాలీవుడ్ లో ఏడు సంవత్సరాల కెరీర్ ని పూర్తి చేసిన కియారా అద్వానీ తదుపరి వరుస చిత్రాల్లో నటిస్తోంది. తదుపరి షేర్షా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత భూల్ భూలయా -2... జగ్ జగ్ జీయో .. శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్న వేరొక చిత్రంలోనూ నటిస్తోంది. టాలీవుడ్ లో నూ ఓ అగ్ర హీరో సరసన నటించనుందని కథనాలొస్తున్నాయి.