నల్ల చీరలో అలాంటి ఎటాకింగ్ వద్దు ప్లీజ్!

Sun Jun 26 2022 18:00:01 GMT+0530 (IST)

Kiara Advani Latest Photo

చీర కట్టులో కియారా అద్వాణీ సొగబులు గురించి చెప్పాల్సిన పనిలేదు. అందమే అసూయే పడేంత అందంతో సారీ లుక్ లో హైలైట్ అవుతుంది. తాజాగా అమ్మడు మరోసారి చీరందంలో తళుకులీనింది. ఈసారి ఏకంగా నల్ల చీర..రయిక ధరించి  ఎద అందాలతో అగ్గిరాజేసింది. మెడలో అందమైన డిజైనర్  నెక్లెస్ అమ్మడి నెక్ ని మరింత అందంగా ఫోకస్ చేస్తుంది.నుదిటిన రుపాయి బిళ్లంతా చీర మ్యాచింగ్ నల్లటి స్టిక్కర్ ధరించింది. కళ్లకి ఐటెక్స్...ఐబ్రోస్..పెదాలపై సన్నని  చీరు నవ్వు కియారా అందానికే వన్నే తీసుకొచ్చాయి.  టాప్ టూ బాటమ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక కియారా లుకింగ్ స్టైల్ సమ్ థింగ్ స్పెషల్ గా  ఫోకస్ అవుతుంది. కియారా చూపులు నేరుగా కుర్ర కారు హృదయానికే తాకుతున్నాయి.

మునుపెన్నడు కనిపించిన లుక్ లో కియారా హైలైట్ అవ్వడం యువతలో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు ఆసక్తికర కామెంట్లతో మరింత  హీటెక్కిస్తున్నారు.  నలుపు చీర యువతలో జోరుగానే ఎరుపెక్కిస్తుంది. చీర ధరించడం కియారికి కొత్తేంకాదు. ఇప్పటికే చాలా రకాల డిజైనర్ సారీస్ లో మెరిసింది. కానీ  నలుపు సారీ ఏభామ ధరించిన ప్రత్యేకమేగా. ఆ ప్రత్యేకతే ఇప్పుడు కియారాపై మరింత కాన్సంట్రేట్ చేసేలా చేస్తోంది.

కియారా అద్వాణీ  సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా  చేస్తోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చరణ్ కి 15వ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా కేటగిరిలో సినిమా రిలీజ్ కానుంది. అలాగే గతంలో చరణ్ నటించిన `వినయ విధేయ రామ`లో నటించిన విషయం తెలిసిందే.

ఇక బాలీవుడ్ లోనూ అమ్మడి కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది.  బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతుంది. గతేడాది చివర్లో రిలీజ్ అయిన `షేర్ షా`..ఇటీవలే రిలీజ్ అయిన `భూల్ భులైయ్యా-2` తో వరుస విజయాలు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా నటిస్తోన్న `గోవింద నామ్ మేరా`లో నటిస్తోంది. శశాంక్ కైథాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.