పొట్టి డెనిమ్ లో వయ్యారం వడ్డించిన కియరా

Fri May 13 2022 08:00:01 GMT+0530 (IST)

Kiara Advani Latest Photo

ముంబై బ్యూటీ కియరా అద్వాణీ గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వెంట వెంటనే పలు ప్రాజెక్టులకు కమిటైన కియరా ఇటు టాలీవుడ్ లో ఆర్.సి 15 లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఇంతలోనే కియరా నటించిన భూల్ భూలయ్యా 2 విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్ల కోసం కియారా అద్వానీ రూ.4227 విలువైన స్ట్రాప్ లెస్ మినీ డెనిమ్ డ్రెస్ ని ధరించింది. ఈ లుక్ లో హెడ్ టర్నర్ గా మారింది కియరా.ఇది డెనిమ్ లుక్. డెనిమ్ పొట్టి ఫ్రాకులో కియరా అందం టూ హాట్ అని చెప్పాలి. ఈ తరహా డ్రెస్ కి సీజన్ తో సంబంధం ఉండదు. ఎప్పటికీ స్టైలిష్ గా కనిపిస్తుంది. డెనిమ్ ఎల్లప్పుడూ యువతరం ఫ్యాషన్ గేమ్ ను సాంప్రదాయ స్టైల్స్ నుండి హాటెస్ట్ ట్రెండ్ వరకు తదుపరి స్థాయికి తీసుకెళ్లగలదు. ఇది అత్యంత సౌకర్యవంతమైన క్రియేటివిటీకి ఆస్కారం కల్పించే విభిన్నమైన లుక్ అని చెప్పాలి. కియారా అద్వానీ ఈ డెనిమ్ లుక్ ని ఇష్టపడుతుందిట. తను భూల్ భూలయ్యా 2 కోసం ప్రమోషనల్ ట్రయల్ లో ఇలా స్పెషల్ గా కనిపించింది.  ఇది అందమైన నీలిరంగు డెనిమ్ డ్రెస్ కావడంతో యూత్ లుక్ అటువైపు నుంచి దూరంగా పోవడం లేదు. క్షణకాలం పాటు బోయ్స్ కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటిచ్చింది మరి.

కియరా స్కై బ్లూ కలర్ స్ట్రాప్ లెస్ డ్రెస్ ని ధరించింది. కాంట్రాస్ట్ బ్రౌన్ స్టిచ్ మరో ఆకర్షణగా నిలిచింది. ఇది అధునాతనమైనది.. ముందు భాగంలో జంట పాకెట్స్ అనేక బటన్లు కనిపిస్తున్నాయి. దుస్తులకు చిరిగిన అంచు కియరా రూపానికి సరిపోయే విధంగా డిజైన్ చేయబడి ఉంది. కియారా ధరించిన ఈ డ్రెస్ ధర $79 AUD (సుమారు రూ. 4227 ). భూల్ భూలయ్యా 2  చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. టబు -రాజ్‌పాల్ యాదవ్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 2022 మే 20న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కియారా తదుపరి విక్కీ కౌశల్- భూమి పెడ్నేకర్‌లతో కలిసి గోవింద మేరా నామ్ లో కనిపించనుంది. ఆమె జగ్‌జగ్ జీయో చిత్రీకరణ పూర్తి చేసింది. అనిల్ కపూర్- నీతూ కపూర్ -వరుణ్ ధావన్ ఇందులో ఇతర తారాగణం. రామ్ చరణ్ సరసన నటిస్తున్న  RC15 షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్ లో సాగుతోంది.