Begin typing your search above and press return to search.

పింక్ స్విమ్ సూట్ లో కియరా ట్రీట్..!

By:  Tupaki Desk   |   19 Jan 2022 2:30 AM GMT
పింక్ స్విమ్ సూట్ లో కియరా ట్రీట్..!
X
కియరా అద్వానీ మాల్దీవుల ట్రీట్ ఇంకా అభిమానుల క‌ళ్ల ముందే ఉంది. వ‌రుస బికినీల‌తో గుండెల్ని మ‌రిగించింది ఈ బ్యూటీ. ఇప్పుడు మ‌రోసారి పూల్ సైడ్ ట్రీట్ తో అగ్గి రాజేసింది. పింక్ స్విమ్ సూట్ లో అలా పూల్ లో స్విమ్ చేస్తున్న‌ కియ‌రా రిలాక్స్ మోడ్ లోకి వ‌చ్చింది. ఇంత‌లోనే కెమెరా క‌ళ్లు క్లిక్ మ‌న్నాయి.

సిద్ధార్థ్ మల్హోత్రాతో కియ‌రా డేటింగ్ కొంత‌కాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట‌ ఫోటోలు .. ఒకరి ఇంట్లో ఒకరు ర‌హ‌స్యంగా క‌లుసుకున్న‌ప్ప‌టి ఫోటోలు అభిమానుల్లో ర‌క‌ర‌కాల ఊహాగానాల‌కు కార‌ణ‌మైంది. ఆ ఇద్ద‌రూ ముచ్చ‌టైన‌ జంటగా ఊహించుకునేలా చేసింది. షేర్షా సిద్దార్థ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకున్నారు. మూల మూల‌ల అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ కోరికను నెర‌వేర్చేందుకు కియారా అద్వానీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో తమ చిత్రం షేర్షా నుండి ఒక అందమైన స్టిల్ ని షేర్ చేస్తూ సిద్ కి శుభాకాంక్షలు తెలిపింది.

ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా నేలపై కూర్చున్న కియారా అద్వానీని కౌగిలించుకుని అత‌డు క‌నిపించాడు. సిద్ నీలిరంగు డెనిమ్ తో జత చేసిన తెల్లటి షర్ట్ లో డాషింగ్ గా కనిపించ‌గా.. కియరా భారతీయ వస్త్రధారణలో మనోహరంగా కనిపిస్తోంది. సిద్ధార్థ్- కియారా ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోతున్న ఈ చిత్రాన్ని పంచుకుంటూ.. కియారా ఇలా రాసింది. ``హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ వన్ @సిదార్థ్ మ‌ల్హోత్రా..`` అని వ్యాఖ్యానించింది.

కియారా అద్వానీతో పాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు కరీనా కపూర్ ఖాన్- విక్కీ కౌశల్- కత్రినా కైఫ్- రష్మిక మందన్న- అనుష్క శర్మ ఇతరులు కూడా బ‌ర్త్ డే బోయ్‌ కి శుభాకాంక్షలు తెలిసేందుకు ఇన్ స్టాలోకి వెళ్లారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 2022లో కియారా అద్వానీ త‌దుప‌రి నెలల్లో విడుదల కానున్న జగ్ జగ్ జీయో - భూల్ భూలయ్యా 2లో కూడా కనిపించనుంది. విక్కీ కౌశల్ - భూమి పెడ్నేకర్ జంట‌గా నటించిన `గోవింద నామ్ మేరా`లోను కియ‌రా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.