కిల్లర్ లుక్ తో కాకలు పుట్టిస్తున్న కియరా

Wed Sep 15 2021 06:00:01 GMT+0530 (IST)

Kiara Advani Latest Photo

ఎం.ఎస్ ధోనీ చిత్రంతో పాపులరిటీని దక్కించుకున్న ముంబై సోయగం కియారా అద్వానీ ఆ తరువాత  అనురాగ్ కశ్యప్ `లస్ట్ స్టోరీస్` సిరీస్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వీయ భావ ప్రాప్తి చెందే యువతి పాత్రలో జీవించి విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని సినీ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. `లస్ట్ స్టోరీ` పేరెత్తితే గుర్తొచ్చేంతగా పాపులర్ అయిన కియారా తెలుగులో మహేష్ నటించిన `భరత్ అనే నేను` చిత్రంతో మంచి హిట్ ని సొంతం చేసుకుంది.ఆ తరువాత `కబీర్ సింగ్` లాంటి పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాల్ని దక్కించుకుంది. డబూ రత్నానీ క్యాలెండర్ పై మెరిసి కుర్రకారుని హీటెక్కించి మరో సారి వార్తల్లో నిలిచింది. వరుస సినిమాల్లో నటించడమే కాకుండా పలు క్రేజీ యాడ్ లలో నటిస్తూ నిత్యం బిజీగా వుంటూ వస్తున్న కియారా తరచూ హాట్ ఫొటో షూట్ లతోనూ అలరిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డ్రెస్ లో దర్శనమిస్తూ కియారా నెటిజన్ లతో పంచుకున్న ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

గ్రీన్ - వైట్ కాంబినేషన్ లో అథ్లెట్ తరహాలో ముస్తాబై ఫొలోలకు పోజులిచ్చిన కియారా పిక్స్ కిల్లింగ్ గా వున్నాయి. ఓ వీడియోతో పాటు పలు ఫొటోలని కూడా కియారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులంతా కియారా కిల్లింగ్ లుక్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

తక్కువ సమయంలో స్టార్ స్టాటస్

కియారా అద్వాణీ తక్కువ స్పాన్ లో అత్యంత వేగంగా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్న నాయిక. కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. వరుసగా బిగ్ స్టార్స్ సరసన ఛాన్సులందుకుంటూ వెలిగిపోతుంది. బాలీవుడ్ కబీర్ సింగ్ ఘనవిజయం తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదని అమ్మడు ఒడిసిపట్టుకుంటోన్న ప్రాజెక్ట్ లను బట్టే తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో నూ అగ్ర హీరోలతోనే సినిమాలు చేస్తోంది. `భరత్ అనే నేను`..`వినయ విధేయ రామ` సినిమాల్లో నటించాక ఇప్పుడు రెండవ సారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇది చరణ్ రెండవ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. దీని(ఆర్.సి15)కి దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కియరా ఈ చిత్రంలో కాస్త ఛాలెంజింగ్ రోల్ లో అవకాశం అందుకుందని కథనాలొస్తున్నాయి. ఇందులో చరణ్ యువ ఐఏఎస్  టర్న్ డ్ సీఎం పాత్రలో నటిస్తున్నారు. అతడికి సహాయకురాలిగా ఛాలెంజింగ్ పాత్రలో కియరా కనిపిస్తుంది. ఇది భరత్ అనే నేను లో పాత్రతో పోలిస్తే చాలా ప్రాధాన్యత ఉన్నది అని తెలిసింది.

ఈ నేపథ్యంలో కియారాపై సంచలన వార్తలు మీడియా వర్గాల్లో హీటెక్కిస్తున్నాయి. కియారాకి గర్వం ఎక్కువని..అహంకారిగా ప్రవర్తిస్తుందని బాలీవుడ్ మీడియాలో ఇటీవల కథనాలు వెలువడుతున్నాయి. అహంకారంతో వచ్చిన  అవకాశాల్ని కాదని...భారీ పారితోషికం సైతం వదులుకోవడానికి వెనుకాడటం లేదని ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించింది.

ఎలాంటి అహంకారం లేదని..అలాంటిదాన్నే అయితే పరిశ్రమ ఎందుకు అవకాశాలిస్తుందని కౌంటర్ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో అవకాశాలు కోసం ఎంతో కష్టపడ్డానని... ఎలాంటి సపోర్ట్ లేకుండా పరిశ్రమకు వచ్చి నటిని అయ్యానని తెలిపింది. అహంకారమే ఉంటే సినిమా పరిశ్రమ అవకాశాలు ఇవ్వదని..ఆ విషయం వార్తలు రాసిన వాళ్లకు కూడా బాగా తెలుసని కౌంటర్ వేసింది.