ఫోటో స్టోరి: కసి కసి చూపులతో కుమ్మేయకలా

Sun Aug 02 2020 13:40:20 GMT+0530 (IST)

Kiara Advani Gorgeous Looks

ముంబై బొమ్మ కియరా కుమ్ముడు గురించి ఏమని చెప్పాలి?  అటు బాలీవుడ్ నే కాదు ఇటు టాలీవుడ్ ని ఈ అమ్మడు కుమ్ముకునేందుకు ఛాన్సున్నా.. ఎందుకనో వెయిట్ చేస్తోంది. అసలు ఈ బ్యూటీ సంతకం చేస్తాను అనాలే కానీ టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఈ ముంబై భామ కోసం క్యూలో ఉన్నారు. ఇటీవల ఆచార్యలో చరణ్ కోసం కియరా పేరును పరిశీలించారని వార్తలొచ్చాయి. అలాగే బన్ని-ప్రభాస్- ఎన్టీఆర్ ఈ భామపై ఆసక్తిగా ఉన్నారని గుసగుసలు వినిపించాయి. భరత్ అనే నేను తర్వాత మహేష్ మళ్లీ ఆఫర్ ఇస్తున్నారన్న ముచ్చటా వేడెక్కించింది. కేవలం స్టార్ హీరోల క్యూ ఇంత పెద్దది ఉంది.కానీ కియరానే చిక్కను దొరకను అంటూ దూరమైపోతోంది. కబీర్ సింగ్ సక్సెస్ తో అలా ఉంది సీను. అటు ఉత్తరాది ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉంది. అక్షయ్ కుమార్ సహా పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. లక్ష్మీ బాంబ్ .. భూల్ బులయా సీక్వెల్ లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు కరణ్ జోహార్ లాంటి టాప్ నిర్మాత కియరా కాల్షీట్ల కోసం ఉబలాట పడుతున్నాడు. అందుకే కియరా క్రేజు అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు ఎక్కడా!

ఆ క్రమంలోనే ఈ అమ్మడు సోషల్ మీడియాల్ని కుమ్మేస్తున్న తీరు ఆ రేంజులోనే ఉంది. నిరంతరం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో కియరా కుమ్ముడే కుమ్ముడు. కత్తి లాంటి కియరా కాటుక కనులతోనో సోగ కనులతోనో కొంటెగా అలా చూస్తుంటే కుర్రాళ్లు ఊరుకుంటారా? తలపుల బాణీలో తలమునకలైపోరూ?  లేటెస్టుగా కియరా రెడ్ హాట్ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.  కిల్లింగ్ రెడ్ హాట్ ఫ్రాకులో కమ్మేస్తోంది అమ్మడు.