కియారా.. ఏం చేసినా కిరాకే

Wed Sep 11 2019 23:00:02 GMT+0530 (IST)

Kiara Advani Glamourous Pose

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న క్రేజియస్ట్ హీరోయిన్లలో కియారా అద్వాని ఒకరు.  ఇప్పటికే కియారా ఖాతాలో 'ఎం.ఎస్. ధోని: ది అన్ టోల్డ్ స్టొరీ' లాంటి హిట్లు.. లస్టు  స్టోరీస్ లాంటి షాకింగ్ వెబ్ సీరీస్ ఉన్నాయి కానీ మొదటిసారిగా 'కబీర్ సింగ్' తో బ్లాక్ బస్టర్ సాధించింది.  ఆ సినిమా ఘన విజయంతో కియారా క్రేజ్ ఉన్నపళంగా డబల్ అయింది.కియరా ఒక ఫ్యాషనిస్టా అనే సంగతి అందరికీ తెలిసిందే.  జిమ్ముకు వెళ్ళే సమయంలో కానీ.. ఎయిర్ పోర్ట్ లో కానీ.. ఫిల్మీ ఫంక్షన్స్.. ప్రమోషన్స్ సమయంలో తన స్టైల్ తో హాట్ యాటిట్యూడ్ తో జనాలను తనవైపు తిప్పుకుంటుంది.  ఇక ఫోటో షూట్లు కనుక చేస్తే కెమెరాలు కూడా వేడెక్కాల్సిందే. ఆ రేంజ్ లో గ్లామరసం ఒలకబోస్తుంది.  తన ఇంట్లో ఒక వాటర్ క్యాన్ లాగా గ్లామర్ క్యాన్ పెట్టుకుని ఆ గ్లామరసం ఒక గ్లాసు తాగి బయటకు వస్తుందేమో.  రీసెంట్ గా కియరా ఒక ఫోటో షూట్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో అందాలను ధారపోసింది. వైట్ థీమ్ కు తగ్గట్టుగా ఆభరణాలు కూడా ధరించింది.  అంతే కాదు తన హెయిర్ కు కూడా వైట్ కలర్ డై వేసుకుంది.  అయితే ఎంత డిఫరెంట్ గా తెల్ల జుట్టుతో కనిపించినా కియరా అందంగానే ఉంది.

"జుట్టున్నమ్మ ఏ కొప్పు కట్టినా అందంగానే ఉంటుంద"ని తెలుగులో ఒక సామెత ఉంది.  కియారాకు అది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.  ఏ డ్రెస్ వేసుకున్నా.. జుట్టుకు ఏ రంగు వేసుకున్నా.. హెయిర్ ను లూజ్ గా వదిలేసినా.. ముడివేసుకున్నా అందంగానే ఉంటుంది.  ఇక కియరా సినిమాల విషయానికి వస్తే 'గుడ్ న్యూస్'.. 'షేర్షా'.. 'లక్ష్మీ బాంబ్'.. 'ఇందూ కీ జవాని' చిత్రాల్లో నటిస్తోంది.