ఫోటో స్టొరీ: పాప సున్నితంగా పోజిచ్చిందిగా..!

Wed Mar 20 2019 13:17:10 GMT+0530 (IST)

Kiara Advani Glamourous Pose

బాలీవుడ్లో ప్రియాంక చోప్రా.. దీపిక పదుకొనే జెనరేషన్ తర్వాత హాటు బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కియారా అద్వాని పేరు మొదటగా చెప్పుకోవాలి. ఈ జెనరేషన్లో అలియా భట్...  జాన్వి కపూర్ లాంటి న్యూ జెన్ భామలు ఉన్నా వారికి కియారాకు ఉన్నంత హాటు.. లస్టు ఇమేజ్ లేదు. దీంతో కియారా తనకు తానే సాటి అన్నట్టుగా చెలరేగిపోతోంది.ముఖ్యంగా ఫ్యాషన్ ఈవెంట్లలో కియారాను కంట్రోల్ చేయడం ఎవ్వరివల్లా కావడం లేదు.  అంత హాటుగా దర్శనమిచ్చి అందరినీ తనవంక తిప్పుకుంటుంది.  ఇక కెమెరాలకు ఫుల్ పని.  అంతటితో ఆగుతుందా అంటే ఊహు.  తన అందమైన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి సోషల్ మీడియాకు మంట పెడుతుంది.  రీసెంట్ గా ఈ లస్టు భామ జీ సినీ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొంది.   ఎల్లో కలర్ డిజైనర్ వేర్ లో తళుక్కున మెరిసిన ఈ అమ్మడు ఒక సెన్సువల్ పోజిచ్చింది. జుట్టును కాస్త దువ్వీ దువ్వనట్టుగా దువ్విన భామ యాక్సెసరీస్ పెద్దగా ధరించలేదు కానీ చేతికి మాత్రం మూడు ఉంగరాలు పెట్టుకుంది. ఆ స్కిన్ టోన్.. ఆ సుకుమారం చూస్తే.. అమ్మాయిలను చూసి ఆమడ దూరం పారిపోయే ఘోటక బ్రహ్మచారి అయినా పాప వెంట హచ్చి కుక్కలా తోక ఊపుకుంటూ అణకువగా ఫాలో ఫాలో అనాల్సిందే.  అయినా చాలామంది ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అంటూ ఉంటారు కాని కియారాను చూస్తుంటే మాత్రం ఎల్లో ఎల్లో వెరీ బ్యూటీఫుల్లో అనాలనిపిస్తోంది!

ఈ ఫోటోకు నెటిజనులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు.  12 గంటలోనే మూడున్నర లక్షలకు పైగా లైకులు కొట్టి తమ జేజేలు తెలియజేశారు.  కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'కబీర్ సింగ్'.. 'కళంక్'.. 'గుడ్ న్యూస్' చిత్రాలలో నటిస్తోంది.  ఈ మూడే కాదు.. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కాంచన' హిందీ రీమేక్ లో హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చిందట.