Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సండే స్పైసీ శారీ ట్రీట్

By:  Tupaki Desk   |   16 Dec 2019 10:52 AM GMT
ఫోటో స్టోరీ: సండే స్పైసీ శారీ ట్రీట్
X
అందమైన భామలకు.. హాటు బ్యూటీలకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రెస్ లాంటిది. ఇలాంటివారు చాలామంది ఉండే బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకోవడం కష్టమే. అలాంటి పని ఎప్పుడో చేసేసింది కియారా. సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తనదైన ఫ్యాషన్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు డ్రెస్సులు వేసుకుంటూ నెటిజన్ల మనసులో కల్లోలం రేపుతూ ఉంటుంది .

ఈరొజంటే సోమవారం. కానీ నిన్న ఆదివారం కదా. దీంతో జనాలు ఫ్రీగా.. ఆనందంగా ఉంటారు కదా అనుకుందేమో కానీ మూడు కత్తిలాంటి ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఓ అందమైన చీర..స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి హొయలు పోతూ నిలుచుంది. మెడలో ఒక వెరైటీ నెక్లెస్ ధరించి.. సరైన మేకప్ తో అందంగా కనిపిస్తోంది. మోడరన్ డ్రెస్సులు బికినీలలో ఎంత హాటుగా ఉంటుందో ఈ చీరలో అంతకంటే డబల్ హాటుగా కనిపిస్తోంది.

సంప్రదాయ ఘాటు ఫోటో నెటిజన్లకు తెగ నచ్చింది. "ఝకాస్ శారీ లుక్".. "సండే శారీ ట్రీట్".. "మమ్మల్ని చంపేస్తావా ఏంటి" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది.