ఫోటో స్టోరి: పింక్ లో పథేర్ పాంచాలి

Thu Jun 24 2021 07:00:01 GMT+0530 (IST)

Kiara Advani Exquisite Looks In Pink

సత్యజిత్ రే దర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్మించిన 1955 నాటి బెంగాలీ చలనచిత్రం పథేర్ పాంచాలి. 1928లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రాసిన పథేర్ పాంచాలి నవల ఈ సినిమా కథకు ఆధారం. ఇది సుప్రసిద్ధ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన తొలి సినిమా. అపు చిత్రత్రయంలో పథేర్ పాంచాలి మొదటిది - దీనిలో అపు బాల్యం చిత్రీకరించారు. ఈ చిత్రం 1955లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ బెంగాలీ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది.బెంగాలీ బ్రాహ్మణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అద్భుత కథతో తెరకెక్కింది. అయితే ఇదంతా ఎందుకు.. ఇప్పుడు అంటే.. పథేర్ పాంచాలి (బెంగాలీ) అంటే తెలుగు అర్థం-చిన్న దారి పాట.. అని..!

తెలుగు హిందీ చిత్రపరిశ్రమలకు సుపరిచితమైన కియరా అద్వాణీ ఇండస్ట్రీ ఔట్ సైడర్ గా `చిన్న దారి`(పథేర్..) వెతుక్కుని పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇక్కడ ఇంతింతై అన్న చందంగా ఎదిగింది. అయితే తనని ఆరంభంలో బ్రాహ్మణ యువతి అని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేవారట. కానీ తను హాఫ్ హిందూ.. హాఫ్ ముస్లిమ్. జగదీప్ అద్వాణీ అనే సింధీ హిందూ బిజినెస్ మేన్ కి .. ఒక ముస్లిమ్ యువతి అయిన జెనీవీవ్ జాఫ్రీ కి కియరా జన్మించింది. అంతేకాదు కియరాకి క్రిస్టియానిటీతోనూ పూర్తి అనుబంధం ఉంది. కియరా తల్లి గారి తల్లి(అమ్మమ్మ) ఓ క్రిస్టియన్. అంటే కియరా అంటే సర్వమత సమ్మేళనం అన్నమాట.

ఇకపోతే కియరా అద్వాణీకి పింక్ అంటే చాలా ఇష్టం. అందుకే పింక్ షేడ్స్‌లో ఉన్న దుస్తుల్ని ధరించేందుకు ఎక్కువ ఇష్టపడుతుందట. అలా కియారా అద్వానీ ఎప్పుడు పింక్ లో మెరిసినా వాటన్నిటినీ ఫోటోగ్రాఫ్ లుగా మలిచి ఇలా ఒక గ్రూప్ ఆల్బమ్ గా ఆవిష్కరిస్తే దానికి అద్భుత స్పందన వచ్చింది. బాలీవుడ్ లో ఎందరు స్టైల్ ఐకన్స్ ఉన్నా పింక్ గులాబీ లుక్ లో కియరాను కొట్టే వేరొక భామ లేదంటే అతిశయోక్తి కాదు !!  కియరా అను పథేర్ పాంచాలీ కథా కమామీషు ఇదీ..