ఈ హీరోయిన్ డే కేర్ లో ఆయాగా చేసిందట!

Sun Dec 08 2019 12:55:04 GMT+0530 (IST)

Kiara Adavni Working in Daycare Centre

ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వరుస చిత్రాలతో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తెలుగు ప్రేక్షకులకు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రంతో సుపరిచితం అయిన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన వరుసగా చిత్రాలు చేస్తూ ఉంది. అర్జున్ రెడ్డి హిందీ వర్షన్ కబీర్ సింగ్ లో నటించడంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఇదే సమయంలో ఈ అమ్మడు మూడు నాలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.అయిదు సంవత్సరాల క్రితమే కియారా అద్వానీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కాని ఎంఎస్ ధోనీ సినిమాలో నటించిన తర్వాతే ఈమెకు గుర్తింపు దక్కింది. ఎంఎస్ ధోనీ తర్వాత హిందీ మరియు తెలుగులో ఈమెకు ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ సరసన నిలిచిన కియారా అద్వానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు డే కేర్ సెంటర్ లో చిన్న పిల్లలకు ఆయాలా వర్క్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా కియారా అద్వానీ చెప్పుకొచ్చింది.

ఇటీవల కియారా అద్వానీ ఈ విషయమై మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు డే కేర్ లో చేసేదాన్ని. మా అమ్మ నిర్వహించే డే కేర్ కు రెగ్యులర్ గా వెళ్లేదాన్ని. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు డే కేర్ లో పిల్లలను చూసుకుంటూ ఉండేదాన్నంటూ చెప్పుకొచ్చింది. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కియారా అద్వానీ భవిష్యత్తులో మరింత స్టార్ డం ను దక్కించుకుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.