శ్రీదేవికి అది నచ్చేది కాదంటున్న ఖుషి!

Tue Apr 23 2019 20:00:01 GMT+0530 (IST)

Khushi Kapoor reveals mom Sridevi never approved of her tattoos

చాలామంది సెలబ్రిటీలకు పచ్చబొట్లంటే ఇష్టం ఉంటుంది. బాలీవుడ్ లో అయితే ఈ టాట్టూల పిచ్చి కాస్త ఎక్కువ. కొంతమంది ఈ టాట్టూలను అందరికీ కనిపించే ప్రదేశంలో పొడిపించుకుంటారు. కొందరు మాత్రం.. కనిపించని ప్రదేశంలో పొడిపించుకుంటారు.  అయితే ఇలా కనిపించని ప్రదేశంలో ఉన్న టాట్టూల గురించి వారు చెప్తేనే కానీ ఇతరులకు తెలియదు. రీసెంట్ గా ఒక చాట్ షోలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ తన ఒంటిమీద ఉన్న టాట్టూల గురించి ఓపెన్ గా మాట్లాడి సర్ ప్రైజ్ చేసింది.  ఈమధ్య జాన్వి కపూర్.. ఖుషి కపూర్ ఇద్దరూ కలిసి బీఎఫ్ ఎఫ్స్ విత్ వోగ్ చాట్ షో కు హాజరయ్యారు. జాన్వి తన ఒంటిపై పచ్చబొట్లు లేవని చెప్పింది. తనకు ఫ్యూచర్ లో రాబోయే భర్తకు మాత్రం 'ప్రాపర్టీ ఆఫ్ జేకే' అని పచ్చబొట్టు పొడిపిస్తానని జోక్ చేసింది.  అయితే ఖుషి మాత్రం అందుకు భిన్నంగా తన ఒంటిపై మొత్తం మూడు టాట్టూలు ఉన్నాయని చెప్పింది. ఒక పచ్చబొట్టులో తన కుటుంబ సభ్యుల పుట్టినరోజులు రోమన్ సంఖ్యలలో ఉంటాయట.  రెండోది తన బెస్ట్ ఫ్రెండ్ పేరట. ఇక మూడోది మాత్రం తన బ్యాక్ పై ఉందని చెప్పింది. ఆ మూడో టాటూ "ఖుద్ కీ రాహ్ బనావో"(సొంతదారి ఏర్పరచుకో) అని ఉంటుందట. ఈ టాట్టూ తనకు కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది.  తన టాట్టూ పిచ్చి అమ్మ శ్రీదేవికి నచ్చేది కాదని.. అక్క జాన్వికి కూడా నచ్చదని కూడా మరో సీక్రెట్ రివీల్ చేసింది.

ఇక ఫిలిం డెబ్యూ గురించి మాట్లాడుతూ.. అక్క జాన్వి దారిలోనే హీరోయిన్ గా కెరీర్ ఎంచుకున్నానని తెలిపింది.  డెబ్యూ విషయంలో గుడ్డిగా కరణ్ జోహార్ ను నమ్ముతానని.. ఆయన అలియా.. వరుణ్ ధావన్.. జాన్విలను లాంచ్ చేసినట్టుగానే తనకు మంచి లాంచ్ మూవీ అందిస్తాడని నమ్మకం ఉందని చెప్పింది.