రేప్ చేస్తాం.. చంపేస్తామన్న వాడి పరువు తీసి కుష్బూ

Wed Aug 05 2020 20:30:42 GMT+0530 (IST)

Kushboo will take away the dignity of those who want to kill

సీనియర్ నటి కుష్బూ తమిళ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తుంటుంది. అలాంటి కుష్బూకే ఓ దుండగుడు జలక్ ఇచ్చాడు.తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి కుష్బూకు ఫోన్ చేసి రేప్ చేస్తామని.. చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. దీంతో ఒళ్లు మండిన కుష్బూ ఏకంగా ఆ ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో పెట్టేసింది. ట్రూ కాలర్ లో వచ్చిన పేరును బట్టి అడ్రస్ ను బట్టి సదురు వ్యక్తిని ఓ రేంజ్ లో ఆడుకుంది. ఇష్టమొచ్చినట్టు తిట్టింది.

ఇలాంటి పనులు చేసే వాడిని ఇలానే అందరి ముందు కడిగేయాలని.. పబ్లిక్ గా పరువు తీయాలని.. వాడికి కూడా కుటుంబం ఉంటుంది కదా అని ఫైర్ అయ్యింది.

ఇక ఈ విషయాన్ని అంతటితో ఊరుకోకుండా కుష్బూ ఏకంగా తనను బెదిరించిన వ్యక్తి నంబర్ కోల్ కతాకు చెందినదని గుర్తించింది. వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేసింది. తనకే ఇలాంటి బెదిరింపులు వస్తే.. ఇక మీ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంటో అని ఆలోచించాలని మమతను చర్య తీసుకోవాలని కుష్బూ వేడుకుంది.