Begin typing your search above and press return to search.

మాస్ రాజా జోరు.. 'ఖిలాడి' టాకీ పార్ట్ పూర్తి..!

By:  Tupaki Desk   |   25 Sep 2021 4:58 AM GMT
మాస్ రాజా జోరు.. ఖిలాడి టాకీ పార్ట్ పూర్తి..!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''ఖిలాడి''. 'ప్లే స్మార్ట్' అనేది దీనికి ట్యాగ్ లైన్. 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌధ‌రి - డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. మ్యూజిక్ ఫెస్టివల్ లో భాగంగా ఇటీవల వదిలిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

'ఖిలాడి' సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మిగిలిన పాటల షూటింగ్ కూడా పూర్తి చేసి.. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. జయంతీలాల్‌ గడ పెన్ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఈ సినిమా రూపొందుతోంది. సత్యనారాయణ కోనేరు దీనికి నిర్మాత. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గాంధీ న‌డికుడిక‌ర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా.. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు.

'ఖిలాడి' చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ మరియు శ్రీ‌కాంత్ విస్సా కలసి సంభాషణలు అందిస్తున్నాడు. రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మరియు అన్బు-అరివు మాస్ట‌ర్స్ యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ - అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా నుంచి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.