Begin typing your search above and press return to search.

#ఖిలాడీ మాస్ రాజా .. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే ట్రీట్

By:  Tupaki Desk   |   24 Jan 2021 5:48 AM GMT
#ఖిలాడీ మాస్ రాజా .. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే ట్రీట్
X
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన క్రాక్ 50కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో అడుగు పెట్టిన సంతోషంలో మ‌రో అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌తో ముందుకొచ్చారు. రవితేజ `ఖిలాడీ- ప్లే స్మార్ట్` ప్ర‌స్తుతం సెట్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆన్ సెట్ నుంచి ఇంత‌కుముందు ఆయ‌న షేర్ చేసిన ఓ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. లైట్స్.. కెమెరా.. యాక్షన్ అంటూ ర‌వితేజ ఇస్పీడ్ చూపించిన ఫోటో హీట్ పెంచింది.

ఇక ఖిలాడీ విభిన్న‌మైన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలోనూ మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉండ‌నున్నాయి‌. జనవరి 26న రవితేజ పుట్టినరోజు కానుక‌గా టీజ‌ర్ ని రిలీజ్ చేస్తామ‌ని ఇంత‌కుముందే టీమ్ ప్ర‌క‌టించింది. తాజాగా మ‌రోసారి ఈ విష‌యాన్ని ఖిలాడీ టీమ్ అధికారికంగా వెల్ల‌డించింది.

``ప్లే ఇట్ స్మార్ట్ ... కౌంట్ మొద‌లైంది.. డ‌బుల్ యాక్ష‌న్ విత్ డ‌బుల్ ట్రీట్..`` అంటూ ప‌చ్చ‌నోటు ఈమోజీ.. డాలర్ ఈమోజీల్ని షేర్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. పోస్ట‌ర్ ఎంతో మ‌ర్మంగా క‌నిపిస్తోంది. డ‌బ్బును శాసిస్తూ.. నోట్ల క‌ట్ట‌ల్లో జీవించే ఖిలాడి క‌థ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. జ‌న‌వ‌రి 26 ఉద‌యం 10.08 నిమిషాల‌కు `గ్లింప్స్ ఆఫ్ ఖిలాడీ` ర‌వితేజ అభిమానుల‌కు ట్రీటివ్వ‌నుంది.

డింపుల్ హ‌యాతీ ఈ చిత్రంలో క‌థానాయిక‌. దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్ ఎల్.ఎల్.పి- పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేస‌వి రిలీజ్ కి టీమ్ టార్గెట్ చేసింది.