ఖైదీ అంతిమ ఫలితం ఏమని తేలింది?

Sun Nov 17 2019 20:00:01 GMT+0530 (IST)

Khaidi Final Collections

ఇటీవలి కాలంలో హిట్టు సినిమా ఏదీ అంటే ఒక డబ్బింగ్ సినిమా పేరు వినిపించింది. కార్తీ నటించిన అనువాద చిత్రం ఖైదీ ఆఫ్ బీట్ పార్మాట్ లో తెరకెక్కి అటు తమిళంతో పాటు ఇటు తెలుగునాటా విజయం అందుకుంది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 28.3 కోట్లకు అమ్మితే.. మూడు వారాల్లో ఆ మొత్తం వచ్చేడమే గాక అనూహ్యమైన లాభాలు దక్కాయని తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల వరకూ పరిశీలిస్తే.. నైజాం- 2.98 కోట్లు.. సీడెడ్ -1.28 కోట్లు.. ఉత్తరాంధ్ర-1.17కోట్లు.. తూ.గో జిల్లా-63కోట్లు.. ప.గో జిల్లా-43లక్షలు.. గుంటూరు -55లక్షలు.. కృష్ణ-77లక్షలు ... నెల్లూరు 39లక్షలు వసూలు చేసింది. ఏపీ-తెలంగాణ కలుపుకుని 21 రోజుల్లో 8.20 కోట్లు వసూలు చేసింది. కేవలం తెలుగు వెర్షన్ ఏకంగా 3.2 కోట్ల ప్రాఫిట్ ని ఇప్పటికే అందుకుంది. ఇటీవలి కాలంలో డబ్బింగ్ సినిమాలేవీ ఆడడం లేదు. ముఖ్యంగా తమిళ సినిమా పప్పులేవీ తెలుగులో ఉడకడం లేదు. అందుకే కార్తీ క్లీన్ గా హిట్టు కొట్టాడని చెప్పొచ్చు.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే.. తమిళనాడు-52.2కోట్లు.. ఏపీ టీజీ కలుపుకుని -14.07కోట్లు.. కర్నాటక 3.10కోట్లు.. కేరళ-8.45కోట్లు వసూలైంది. ఇతర భారతదేశం నుంచి 1.83కోట్లు.. మొత్తం ఇండియాలో 80కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ నుంచి మరో 18కోట్లు కలుపుకుని వరల్డ్ వైడ్ 97.65కోట్లు వసూలు చేసింది. షేర్ పరిశీలిస్తే 52 కోట్లు వసూలైంది. కేవలం 28.3 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసి ఆల్మోస్ట్ డబుల్ షేర్ వసూలు చేసింది. అంటే పంపిణీదారులకు డబుల్ లాభాలొచ్చాయన్నమాట. ఇది హిట్టు కాదు బ్లాక్ బస్టర్ అని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

మూడు వారాల్లో 52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఇప్పటికే వరల్డ్ వైడ్ 13.7 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక 4 వ వీకెండ్ లో కూడా స్ట్రాంగ్ గా ఉండటం తో లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్ళే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.