Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ (X) క‌మల్.. ఖైదీ డైరెక్ట‌ర్ స‌వాల్!

By:  Tupaki Desk   |   6 Dec 2019 5:55 AM GMT
ర‌జ‌నీ (X) క‌మల్.. ఖైదీ డైరెక్ట‌ర్ స‌వాల్!
X
కార్తి న‌టించిన `ఖైదీ` చిత్రం ఊహ‌కంద‌ని సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. త‌మిళ్- తెలుగు రెండు చోట్లా బాక్సాఫీస్ వ‌ద్ద మోత మోగించారు. హీరోయిన్‌- డ్యూయెట్స్‌- రొమాన్స్ అనే అంశాలే లేకుండా ప‌క‌డ్బందీ స్క్రీన్ ప్లేతో సినిమా తీసి మెప్పించ‌వ‌చ్చ‌ని .. బాక్సాఫీస్ ని కుమ్మొచ్చ‌ని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ నిరూపించాడు. ఈ సినిమా అనూహ్య విజ‌యంతో హీరో కార్తి కెరీర్ మ‌ళ్లీ స్పీడందుకుంది. ప‌క్కా రా కంటెంట్ ని ఎంచుకుని త‌నదైన‌ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో ఖైదీ చిత్రాన్ని జ‌న‌రంజ‌కంగా మ‌లిచిన లోకేష్ క‌న‌క‌రాజ్ ప్ర‌స్తుతం ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే ఆయ‌న మ‌రో సాహ‌సానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని త‌మిళ ఇండ‌స్ట్రీ టాక్‌.

`ఖైదీ` లాంటి ప్ర‌యోగంతో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకున్న లోకేష్ క‌న‌క‌రాజ్ త్వ‌ర‌లో ఇద్ద‌రు లెజెండ్స్ కాబినేష‌న్ లో ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్‌. 40 ఏళ్ల క్రితం ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ చిత్రంలో న‌టించారు. ఆ త‌రవాత ఇన్నేళ్ల‌కు వీరిద్ద‌రిని ఒకే సినిమాలో చూపించ‌డానికి లోకేష్ అడుగులు వేస్తున్నార‌ట‌. ఇదేగ‌నుక‌ కార్య‌కూపం దాల్చితే ద‌క్షిణాదిలోనే సిస‌లైన‌ సంచ‌ల‌నానికి కొత్త సాంప్ర‌దాయానికి ఈ సినిమా శ్రీ‌కారం చుట్టే అవ‌కాశాలున్నాయ‌ని అంతా అంటున్నారు.

ఓ భారీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం `ద‌ర్బార్` చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్త‌యింది. రీసెంట్ టీజ‌ర్ కు అనూహ్య స్పంద‌న రావ‌డంతో ఈ చిత్రంపై త‌మిళ‌నాట‌ భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. త‌మిళం- తెలుగు భాష‌ల్లో 2020 సంక్రాంతికి బ‌రిలోకి దిగుతోంది. మ‌రో వైపు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ `ఇండియ‌న్‌-2` చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది