Begin typing your search above and press return to search.

ఖైదీ-2: సూర్య‌..కార్తి లింక్ ఎలా?

By:  Tupaki Desk   |   6 July 2022 10:30 AM GMT
ఖైదీ-2: సూర్య‌..కార్తి లింక్ ఎలా?
X
లోకేష్ క‌న‌గ‌రాజ్ 'ఖైదీ-2' పై భారీ అంచ‌నాలు నెల‌కొంటున్న సంగ‌తి తెలిసిందే. 'విక్ర‌మ్-2' లో సూర్య రోలెక్స్ పాత్ర‌తో సినిమా రేంజ్ నే మార్చేసాడు. అత‌ను క‌నిపించింది ఐదు నిమిషాలే ? అయినా థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లిపోయింది. అలాంటి పవ‌ర్ ఫుల్ పాత్ర ఉన్న 'విక్ర‌మ్' కి-కార్తీ న‌టించిన 'ఖైదీ'కి లింక్ చేసారు. ఇది పూర్తిగా డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ డీకోడింగ్ అని చెప్పాలి. ఆయ‌న‌. మాట‌లు ప‌రిశీలిస్తే లొకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ అని తెలుస్తోంది.

అంటే ఒక సినిమాలో ఉన్న పాత్ర‌లు వేరే సినిమాలో కూడా ఎంట్రీ ఇస్తుంటాయి. అలాగే ఆ సినిమాకి- ఈసినిమాకి మ‌ధ్య కొన్ని కామ‌న్ పాయింట్స్ లింక్ అవుతుంటాయి. ఈ నేప‌థ్యంలో 'విక్ర‌మ్'-'ఖైదీ' సినిమాల‌కు ఎలా లింక్ చేసారో ? చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. 'ఖైదీ'లో కార్తి 10 ఏళ్లు జైలులో ఉండి రిలీజ్ అవుతాడు. అదే రోజు రాత్రి చిత్తూరు పోలీసులు పెద్ద డ్రగ్ లోడ్ ని ప‌ట్టుకుంటారు.

ఈ డ్ర‌గ్ బ‌స్తాల‌పై ఓ తేలు బొమ్మ ఉంటుంది. ఇదే తేలు బొమ్మ విక్ర‌మ్ లో కనిపిస్తుంది. అంటే ఈ రెండింటికి ఒక్క‌డే ఓన‌ర్. అత‌నే రోలెక్స్ అలియాస్ సూర్య‌. ఇక్క‌డ సూర్య లుక్ ని గ‌మ‌నిస్తే అత‌ని మెడ‌ మీద తేలు టాటూ క‌నిపిస్తుంది. ఈ సింబ‌ల్ ని బ్రాండ్ గా చేసుకునే రెలెక్స్ డ్ర‌గ్ మాఫియాని ఏల్తుంటాడు. పాయింట్ -2లో రోలెక్స్ కింద ప‌నిచేసే లోక‌ల్ డ్ర‌గ్ డీల‌ర్స్ ఉంటారు. 'ఖైదీ'లో ఆదిశంక‌రం బ్ర‌ద‌ర్స్ డ్ర‌గ్స్ ని స‌ముద్రంలో నుంచి బ‌య‌ట‌కు తీసుకొస్తారు.

ఇక 'విక్ర‌మ్' లో రోలెక్స్ కింద సంతానం (విజ‌య్ సేతుప‌తి) ప‌నిచేసాడు. సంతానం ఒక కెమిక‌ల్ జీనియ‌స్ .అంటే అత‌ను రా స‌బ్ స్టెన్స్ నుంచి డ్ర‌గ్స్ ని ప‌ప‌రేట్ చేసి రోలెక్స్ ద‌గ్గ‌ర‌కి పంపిస్తాడు. దీని ప‌రంగా చూస్తే 'ఖైదీ' సినిమాలో గ్ర‌డ్స్ సంతానం ద‌గ్గ‌ర‌కి వ‌చ్చే అవ‌కాశం ఉంది. వీళ్లంతా రోలెక్స్ టీమ్. అప్ప‌టికే కార్తి రోలెక్స్ కి శ‌త్రువుగా మారిపోయాడు. ఇక్క‌డ లోకేష్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

జైలు లో ఉన్న ఆది శంక‌రం తో అత‌ను ఈ మ‌నిషి ఎవ‌రు? మ‌న‌వాళ్ల‌ని కోట్టాడు? వాడికి సంబంధం? ఏంటి అని అంటాడు. అప్పుడు ఆది శంక‌రం కంగారు ప‌డుతూ వాడికి సంబంధం ఉంది అంటాడు. అంటే ఆది శంక‌రానికి కార్తీ ముందే తెలుసు. కార్తీ వీళ్ల‌కి ఎలా తెలుసు అన్న‌ది 'ఖైదీ -2' లో చూపించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కార్తిని విక్ర‌మ్ ఎలా లిక్ చేసారో చూస్తే?

విక్ర‌మ్ ఎండింగ్ లో ఆదిశంక‌రం-అమ‌ర్ క‌లిసి రోలెక్స్ ని క‌ల‌వ‌డానికి వెళ్తారు. అప్పుడు రోలెక్స్ ని వాళ్లు చాలా క్యాజువ‌ల్ గా పిలుస్తారు. వాళ్ల సాన్నిహిత్యం రోలెక్స్ తో రిలేష‌న్ రివీల్ చేసేలా క‌నిపిస్తుంది. అప్పుడే అమ‌ర్ మాట్లాడుతూ చిత్తురు లో స‌రుకు పోవ‌డానికి ముఖ్య కార‌ణం ఢిల్లీ పేరు చెబుతాడు. ఇలా 'ఖైదీ' సినిమా క‌థ మొత్తాన్ని విక్ర‌మ్ కి లింక్ చేసారు.

ఇప్పుడు రోలెక్స్ కార్తీ మీద ప్ర‌తీకారం తీర్చుకోవాలి. అంటే ఖ‌చ్చితంగా 'ఖైదీ -2'లో కార్తీ న‌టించాలి. అలా కుద‌ర‌ని ప‌క్షంలో మ‌రో ఛాన్స్ ఉంది. 'ఖైదీ-2' లో కార్తీ గ‌తం మాత్ర‌మే చూపించి సినిమా ముగింపులో రోలెక్స్ కి ఎదురుప‌డిన‌ట్లు చూపించే అవ‌కాశం ఉంది. త‌దుప‌రి వీళ్లిద్ద‌రి స్టోరీని 'విక్ర‌మ్ -2' లోకి క‌న్వ‌ర్ట్ చేస్తారు. ఎందుకంటే రోలెక్స్ కి ఢిల్లీ ఒక్క‌డే శ‌త్రువు కాదు.

ఒక ప‌క్క పోలీసులు..మ‌రోవైపు మాస్ గ్యాంగ్ లో చేరిన ఫ‌హ‌ద్ పాజ‌ల్.. అలాగే కమ‌ల్ హాసన్ ఇలా అంతా రోలెక్స్ ని వెతికే వారే. అలా చూసుకుంటే కార్తీ 'ఖైదీ -2' నుంచి నేరుగా 'విక్ర‌మ్ -2'లోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశ ఉంది. విక్ర‌మ్ త‌దుప‌రి భాగాల్లో 'ఢిల్లీ'..'విక్ర‌మ్'..'రోలెక్స్' ముగ్గురు కూడా క‌లిసి న‌టించే అవ‌కాశం ఉంది. ముగ్గురు వేర్వేరుగానే సినిమాలు చేస్తేనే పీక్స్ లో ఉంటాయి. అలాంటింది ముగ్గురు ఒకే ప్రేమ్ లో క‌నిపిస్తే విధ్వంస‌మే.