Begin typing your search above and press return to search.

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అయినా అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..!

By:  Tupaki Desk   |   24 Jan 2021 12:30 AM GMT
ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అయినా అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..!
X
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రొమాంటిక్' తో హీరోయిన్ గా పరిచయం అవుతోంది అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ.. రెగ్యులర్ గా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మతులు పోగొడుతుంది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ తన అందాలతో పిచ్చెక్కిస్తుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమా విడుదల అవ్వకముందే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇప్పుడు ఎక్క‌డ విన్నా కేతికా శ‌ర్మ పేరు ఇండ‌స్ట్రీలో మారుమోగిపోతోంది.

ప్రస్తుతం కేతిక శర్మ చేతిలో నాలుగైదు క్రేజీ ఆఫ‌ర్లు ఉన్నాయని తెలుస్తోంది. యువ హీరో నాగశౌర్య నటిస్తున్న 'లక్ష్య' సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో కేతిక శ‌ర్మ‌కు ఆఫ‌ర్ ఉంద‌ని టాక్ నడుస్తోంది. అలానే అల్లు అర్జున్ - కొర‌టాల శివ కలయికలో రానున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింద‌ని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ బ్యూటీ నటించిన 'ల‌క్ష్య' 'రొమాంటిక్' సినిమాలు విడుదలైన తర్వాత అమ్మడి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.