తొలిప్రేమ హీరోయిన్ ఏం చేస్తోందంటే...

Fri Jun 03 2016 10:40:16 GMT+0530 (IST)

తొలిప్రేమ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో అనుబంధం పెనవేసుకుంది కీర్తి రెడ్డి. ఆ మూవీతో పవన్ కళ్యాణ్ ఎంతగా గుర్తింపు సంపాదించుకున్నాడో.. అంతగానూ పేరు తెచ్చుకుంది కీర్తి రెడ్డి. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోవడం మూడు సినిమాలు వరుసగా చేసేయడం జరిగిపోయింది. ఈమె చివరిసారిగా ఆన్ స్క్రీన్ పై.. మహేష్ అక్కగా 2004లో అర్జున్ మూవీలో కనిపించింది. అదే ఏడాది టాలీవుడ్ హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.సుమంత్ ని పెళ్లి చేసుకున్నా.. తర్వాత వీరిద్దరూ అభిప్రాయబేధాలతో విడిపోయారు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయిందని వినడమే తప్ప.. అప్ డేట్ కూడా ఏం రాలేదు. గతేడాది మాత్రం ఓసారి ఇండియాకి వచ్చి ఓ పెళ్లిలో సందడి చేసింది కీర్తి రెడ్డి. హీరో సామ్రాట్ ఈమెకు కజిన్ అవుతాడు. అతని పెళ్లికి వచ్చినపుడే.. బాగా లావైన శరీరంతో కనిపించింది కీర్తి రెడ్డి.

అయితే.. ఈమె అమెరికాలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి జరిగి కూడా చాలా ఏళ్లే అయ్యింది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే.. గ్లామర్ ఇండస్ట్రీ నుంచి దూరం జరిగాక మీడియా ఫోకస్ అవసరం లేదని భావించడంతోనే.. ఏ డీటైల్ లీక్ కాకుండా జాగ్రత్త పడిందట కీర్తి రెడ్డి.