'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ప్రకటించిన కీర్తిసురేష్.. ఎప్పుడంటే?

Mon Mar 01 2021 12:00:01 GMT+0530 (IST)

Keerthysuresh announces release date of 'Good Luck Sakhi' .. When?

మహానటి సూపర్ సక్సెస్ తర్వాత హీరోయిన్ కీర్తిసురేష్ మంచి క్రేజుతో సినిమాలు వరుసగా చేస్తూనే ఉంది. ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ కూడా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. కానీ కీర్తి మహానటి తర్వాత దాదాపు మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఓకే చేసింది. మహానటి తర్వాత కీర్తి నుండి పెంగ్విన్ సినిమా విడుదలైంది. ఆ మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ మిస్ ఇండియా. అదికూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇప్పుడు మరో సినిమా గుడ్ లక్ సఖి.. సినిమా విడుదలకు రెడీ అయిపోయింది. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో అదే చక్రంలో ఇరుక్కుంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో హీరోల సరసన సినిమాలు కూడా ఓకే చేసి అందరిని హ్యాపీ చేసింది.అయితే నేషనల్ అవార్డు విన్నర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి చేస్తున్న 'గుడ్ లక్ సఖి' సినిమా షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విభిన్నమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా గతేడాది విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదాపడింది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లతో సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 3న ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ భాషలలో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా.. శ్రావ్యవర్మ సహానిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కీర్తి తెలుగులో రంగ్ దే సర్కారు వారి పాట పవర్ పేట సినిమాలు చేస్తోంది. అయితే రంగ్ దే సినిమా మార్చ్ 26న థియేటర్లోకి రానుంది.