Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ ఏంట్రా ఇంత సింపుల్ గా ఉంది

By:  Tupaki Desk   |   28 March 2023 8:47 PM GMT
కీర్తి సురేష్ ఏంట్రా ఇంత సింపుల్ గా ఉంది
X
తెలుగులో నేను లోకల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. ముఖ్యంగా ఆమె నటించిన మహానటి అనే సినిమా ఆమెకు బిగ్ బ్రేక్ తీసుకువచ్చింది. మహానటి సినిమాతో సావిత్రి పాత్రలో నటించిన ఆమె ఒక్కసారిగా తెలుగు వారందరి మనసులు దోచేసింది.

ఒక్కసారిగా తెలుగులో కీర్తి సురేష్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ దెబ్బకు వరుస లేడీ ఓరియంటెడ్ సినిమా ఆఫర్లు దక్కాయి. ఎందుకో ఏమో తెలియదు కానీ కీర్తి సురేష్ చేసిన దాదాపు అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ ఏమనుకుందో ఏమో గాని అప్పటివరకు అందాల ఆరబోత విషయంలో గ్లామర్ షో విషయంలో పూర్తి విరుద్ధంగా ఉన్న ఆమె ఒక్కసారిగా సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ సినిమాలో అందాలు ఆరబోతకు సిద్ధమైంది.

ఇక అప్పుడు మొదలుపెట్టిన ఆమె పలు సినిమాల్లో కూడా గ్లామర్ గా కనిపించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి ఆమె దసరా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే ఒక పాత్రలో నటించింది.

ఆ పాత్రకి దాన బాగా కనెక్ట్ అయినట్టుగా ఇప్పటికే పలు సందర్భాల్లో ఆమె కామెంట్లు చేస్తూ వచ్చింది ప్రమోషన్స్ లో కూడా తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి కామెంట్లు చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో తాను గడిపిన కొన్ని అద్భుతమైన అనుభూతులను ప్రేక్షకులకు కూడా పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

వెన్నెల పాత్రలో షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న మోగజీవాలతో తాను ఎలా స్పెండ్ చేశాననే విషయం మీద కొన్ని వీడియోలను షేర్ చేసింది ఆ వీడియోలలో ఆమె అక్కడ ఉన్న ఆవులు మేకలు, కోళ్లతో చాలా సరదాగా గడుపుతుంది. చూస్తే కీర్తి సురేష్ ఏంట్రా ఎంత సింపుల్ గా ఉంది అనిపించే అంతలా ఆమె అక్కడి వారితో కలిసిపోయింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.