మరో డెబ్యూ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

Tue Aug 13 2019 23:13:30 GMT+0530 (IST)

Keerthy Suresh Gives Chance to Debut Director

మహానటి ఎనలేని కీర్తి సంపాదించుకున్న కీర్తి సురేష్ ఆ సినిమాకు గానూ నేషనల్ అవార్డ్ దక్కించుకుంది. మహానటి తో భారీ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నరేంద్ర అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి క్యారెక్టర్ చుట్టూనే కథ నడుస్తుంది. అందుకే మేకర్స్ ఏరికోరి మరీ కీర్తి తీసుకున్నారు. కథ బాగా నచ్చడంతో మహానటి తర్వాత డెబ్యూ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చింది.అయితే ఇప్పుడు కీర్తి మరో డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేయబోతుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తమిళ సినిమా చేయనుంది. ఈ సినిమాను 'పేట' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీర్తీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం కీర్తీ సురేష్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తెలుగులో రెండు సినిమాలు తమిళంలో ఒకటి అలాగే మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ అనౌన్స్.చేసిన తర్వాత ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఈ నాలుగు సినిమాల్లో రెండు షూటింగ్ పూర్తయ్యాక మిగతా సినిమాలు ఒప్పుకోనుంది.