Begin typing your search above and press return to search.

ముద్దులకు సైసై అంటోందా.. నైనై అంటోందా?

By:  Tupaki Desk   |   1 Jun 2020 12:30 PM GMT
ముద్దులకు సైసై అంటోందా.. నైనై అంటోందా?
X
ఈమధ్య మహమ్మారి దెబ్బకు ఫిలింమేకర్లు లిప్ లాకులకు కొద్దిరోజులు బైబై చెప్తారని.. సీరియల్ కిస్సర్లు కూడా పాతకాలం పువ్వుల.. ఆకుల వెనక సోషల్ డిస్టెన్సింగ్ కిస్సులకు ఓకే చెప్పక తప్పదని ఎన్నో చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే 'మహానటి'తో భారీ గుర్తింపు సాధించిన కీర్తి సురేష్ తన కెరీర్లో ఈ లిప్పు లాకులకు.. బికినీలకు మొదటి నుంచి దూరంగానే ఉంది. అలాంటి సన్నివేశాలు ఉంటే ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తోందని కూడా వార్తలు వచ్చాయి ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో వాటిపై ఓ క్లారిటీ ఇచ్చింది.

'మహానటి' సినిమా తర్వాత ప్రేక్షకులు తనను ఒక సాధారణ హీరోయిన్ లాగా కాకుండా ఓ మంచి నటిగా భావిస్తున్నారని.. అందుకే తన పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నానని చెప్పింది. అంతే కాకుండా తనకు అలాంటి సన్నివేశాలలో నటించడం వ్యక్తిగతంగా ఇష్టం లేదని చెప్పింది. ఒకవేళ బోల్డ్ గా ఉండే పాత్రలు.. లిప్ లాక్ సీన్స్ లో తను నటించడం ప్రేక్షకులకు నచ్చదని అనుకుంటునున్నానని తెలిపింది.

'మహానటి' తర్వాత తన నుంచి మంచి పాత్రలు ఆశిస్తున్నారని అందుకే.. ప్రేక్షకులు తనను ఎలాంటి పాత్రల్లో చూడడానికి ఇష్టపడతారో అలాంటి క్యారెక్టర్లు ఎంచుకుంటున్నానని స్పష్టం చేసింది. కీర్తి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో 'రంగ్ దే'.. 'గుడ్ లక్ సఖి' సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో 'అన్నాతే'.. 'పెంగ్విన్'.. 'మిస్ ఇండియా' సినిమాల్లో నటిస్తోంది..