Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : సూపర్ స్టైలిష్‌ లుక్‌ తో మహానటి

By:  Tupaki Desk   |   27 Sep 2022 2:30 AM GMT
పిక్ టాక్‌ : సూపర్ స్టైలిష్‌ లుక్‌ తో మహానటి
X
కీర్తి సురేష్ అంటే మొన్నటి వరకు మహానటి సినిమా గుర్తుకు వచ్చేది. ఆ ఇమేజ్ నుండి మెల్ల మెల్లగా కీర్తి సురేష్ బయటకు వస్తుంది. మహానటి పాత్ర లో అంతగా ఒదిగి పోయిన కీర్తి సురేష్ ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా తో పోల్చి చూస్తూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే కీర్తి సురేష్ మహానటి ఇమేజ్ నుండి బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఇటీవల మహేష్ బాబుకు జోడీగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో అందాల ఆరబోత చేసింది. అంతే కాకుండా రెగ్యులర్ కమర్షియల్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడి యొక్క లుక్‌ మరియు పాత్ర ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. ముందు ముందు అలాంటి పాత్రలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా కీర్తి సురేష్ తాజా ఫోటో షూట్స్ తో కూడా చెప్పకనే చెబుతోంది.

తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. ఇతర హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తే.. అంతకు మించి అన్నట్లుగా ఎక్స్‌ పోజింగ్‌ చేస్తేనే వైరల్‌ అవుతారు. కానీ కీర్తి సురేష్ ఇలాంటి ఫోటోలు కూడా వైరల్‌ అవుతూ ఉంటాయి. కీర్తి సురేష్ సోషల్‌ మీడియాలో తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటో గురించి అభిమానులు తెగ చర్చించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అమ్మడు సూపర్‌ స్టైలిష్‌ లుక్ లో ఆకట్టుకుంటుందంటూ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. సింపుల్‌ అండ్ స్వీట్‌ క్యూటీ కీర్తి సురేష్ అంటూ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి తెలుగు లో సినిమాలు చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. హిందీ నుండి కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.