కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' పోస్టర్...!

Thu Aug 13 2020 19:00:39 GMT+0530 (IST)

Keerthi Suresh 'Good Luck Sakhi' Poster ...!

'మహానటి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో గ్లామర్ పాత్రలకు దూరంగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 'పెంగ్విన్' 'మిస్ ఇండియా' వంటి సినిమాలలో నటించిన కీర్తి 'గుడ్ లక్ సఖి' అనే సినిమాలోనూ నటించింది. 'లక్ష్మి' 'ధనిక్' వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి - జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తాజాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15 ఉదయం 10 గంటలకు 'గుడ్ లక్ సఖి' టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. గిరిజన యువతి వస్త్ర అలంకరణతో కాళ్ళకి కడియాలు ధరించి కీర్తి సురేష్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటేనే కీర్తి మరో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తోందని అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రం తెలుగుతోపాటు మలయాళం తమిళంలోనూ విడుదల కాబోతోందని సమాచారం. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'గుడ్ లక్ సఖి' కరోనా వల్ల నిలుపుదల చేసుకుంది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే మిగిలిన వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేయనున్నారు.