Begin typing your search above and press return to search.

సంగీతం నేర్పే గురువుగారితో కీర్తి ల‌వ్ స్టోరి

By:  Tupaki Desk   |   10 May 2021 3:30 AM GMT
సంగీతం నేర్పే గురువుగారితో కీర్తి ల‌వ్ స్టోరి
X
గ్లామ‌ర్ డాళ్ అయినా.. ట్రెడిష‌న‌ల్ రోల్ అయినా.. పాత్ర ఎలాంటిదైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల ట్యాలెంటెడ్ న‌టిగా కీర్తి సురేష్ నిరూపించుకుంది. `మ‌హాన‌టి` లాంటి క్లాసిక్ హిట్ తర్వాత టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చినా ఎందుక‌నో వ‌దులుకుంది. బాలీవుడ్ ప్ర‌య‌త్నాలు కొంత స‌మ‌యం వృధా చేశాయి. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ హిస్టారిక‌ల్ మూవీ `మరక్కర్` లో న‌టిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.

మ‌ల‌యాళ భాష‌లోనే తొలిసారి 100కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. సినిమా ప్ర‌చార చిత్రాలు హైప్ పెంచాయి. తాజాగా ఈ సినిమా తొలి క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్ ని నేడు రిలీజ్ చేసారు. పురాణ చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో కీర్తి సురేష్ పాత్ర ఎలా ఉంటుంద‌నే క్యూరియాసిటీకి తెర‌దించుతూ తొలి పోస్ట‌ర్ దూసుకొచ్చింది. కీర్తి మ‌హారాణినే త‌ల‌పిస్తోంది. మ‌ల‌యాళీ స్టైల్ డ్రెస్సింగ్ రాకుమారిలా ఆక‌ట్టుకుంటోంది. ముక్కుకు ముక్కెర‌.. మెడ‌లో హారం.. పాపిడి బొట్టు.. ప‌సుపు రంగు సిల్క్ చీర‌లో గ్రీన్ జ‌రీ బోర్డ‌ర్.. బంగారు ఆభ‌‌ణాల‌తో త‌ళ‌త‌ళ‌లాడిపోతోంది.

ఇందులో కీర్తిసురేష్ శాస్త్రీయ సంగీత కళాకారిణి ఆర్చ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే గురువుతో కీర్తి ల‌వ్ స్టోరి స్పెష‌ల్ గా ఉంటుంద‌ట‌. తాజాగా రిలీజ్ చేసిన లుక్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ఇక ఈ సినిమా క‌థాంశానికి వ‌స్తే పోర్చు గీసు వారి దండ‌యాత్ర‌కు వ్య‌తిరేకంగా మ‌ల‌బార్ తీరాన్ని ర‌క్షించ‌డానికి వెళ్లిన క‌మాండ‌ర్ కుంజ‌లి మర‌క్క‌ర్ ఎలాంటి పోరాటం సాగించారు? అనే ఇతివృత్తంతో సాగ‌నుంది. ఈ చిత్రానికి ప్రియద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మంజు వారియ‌ర్... సునీల్ శెట్టి.. అర్జున్ స‌ర్జా.. సుహాసిని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇదే ఏడాది ఆగ‌స్ట్ 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.