ఫోటో స్టోరి: రెడ్ హాట్ అందాల తపర్

Tue Aug 04 2020 11:30:59 GMT+0530 (IST)

Kavya Thapar Stunning Pose In Red Dress

కావ్య తపర్ .. పేరు వినగానే ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? డ్యూరెక్స్ కండోమ్ యాడ్ టీవీల్లో పాపులరవ్వడానికి ఈ అమ్మడే కారణం. కథానాయికగా కంటే ఈ అమ్మడు ఆ యాంగిల్ లోనే ఎక్కువగా గుర్తుంది. గుబులు పుట్టించే అందాలతో కవ్వించడం ఈ అమ్మడికి కొత్తేమీ కాదని ఆ ప్రకటనతో ప్రూవైంది.అయితే డ్యూరెక్స్ యాడ్ లో నటించిన సమయంలోనే కావ్య తపర్ నటించిన `అంతరిక్షం` రిలీజైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నాయికగా ఎంపికై టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇండస్ట్రీ వర్గాల్ని హీటెక్కించింది తపర్. ఈ ముంబై భామ వేడెక్కించే కండోమ్ యాడ్లో కనిపించడం ఆ తర్వాత మైనస్ అయ్యింది. ఇప్పటికీ కావ్యకు తెలుగు చిత్రసీమలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఈ భామ ఫైట్ మాష్టర్ విజయన్ తనయుడు రాహుల్ విజయ్ సరసన ఈ మాయ పేరేమిటో చిత్రంలో నటించింది. ఆ సినిమా కూడా `అంతరిక్షం` మూవీలో నటించేప్పుడే దక్కిన ఆఫర్. ఇటీవల వేరొక అవకాశం లేదు.

ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ టైటిల్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. పనిలోపనిగా కావ్య తపర్ సోషల్ మీడియాల్లో జరంత స్పీడ్ గానే ఉంది. ఇదిగో లేటెస్టుగా రెడ్ హాట్ లుక్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది. వేడెక్కించే అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ భామకు మరిన్ని అవకాశాలు ఖాయమేనని భావిస్తున్నారు. అయితే ఆరబోతపైనే ఆధారపడక నటన పరంగా కావ్య మెరుగులద్దుతుందేమో చూడాలి.