తెలుగు తెరకు మరో కన్నడ 'కావ్య' కన్య

Tue Nov 29 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Kavya Shetty to Get Introduced in Telugu Film

తెలుగు తెరపై ఇప్పుడు కన్నడ అందాలు సందడి చేస్తున్నాయి.  గతంలో మళయాలం తమిళ ఉత్తారాభి భామల హడావుడి ఎక్కువగా ఉండేది. ఇటీవల కాలంలో కన్నడ భామల హవా టాలీవుడ్‌లో నడుస్తోంది.  రష్మిక కృతిశెట్టి పూజా హెగ్డే లాంటి అందాల భామలు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భామలు నటించిన చిత్రాలు కమర్షియల్‌గా చక్కటి విజయాలు అందుకుంటుండంతో ఇప్పుడు కన్నడ భామల దిగుమతి కూడా టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది.  ఈ ట్రెండ్ క్రమంలో తాజాగా  తెలుగు తెరకు మరో కన్నడ భామ పరిచయం కాబోతోంది.  ఈ సుందరి పేరే కావ్యా శెట్టి. 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో  కావ్యా శెట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో తమన్నా .. మేఘ ఆకాశ్ లతో పాటు మూడో హీరోయిన్ గా కావ్య శెట్టి కనిపించనుంది. డిసెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

కర్నాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన కావ్యాశెట్టి 2013లోనే నమ్మ దునియా నమ్మ స్టైలే అనే కన్నడ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. తరువాత ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసెట్టి సినిమాలు చేస్తూ కోలీవుడ్‌లో కాలుపెట్టింది. అక్కడ మంచి సక్సెస్ సాధించిన ఈమె తాజాగా టాలీవుడ్‌లోనూ తెరంగేట్రం చేస్తోంది.  

2020లో కన్నడలో విడుదలైన  లవ్ మాక్‌టైల్  సినిమాను తెలుగులో  'గుర్తుందా శీతాకాలం'     పేరిట రీమేక్ చేస్తున్నారు. మధ్యవయస్కుడైన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా కథనంతో కూడిన ఈ సినిమాలో తమన్నా మెయిన్ హీరోయిన్‌గా మేఘా ఆకాష్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. కావ్యా శెట్టి మూడో హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తూ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రురాలైన కావ్యా శెట్టి 2011లో జరిగిని మిస్ ఫెమీనా ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఫొటోజెనిక్ అవార్డును సొంతం చేసుకుంది.  కాష్ బ్రాండ్ పేరిట ఆమె ఒక బట్టల దుకాణం జ్యూవెలరీ షాపు కూడా నిర్వహిస్తోంది. తెలుగులో తాను నటించిన సినిమా గురించి చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు కావ్యా శెట్టి అంటోంది.  

ఈ సినిమాలో తన పాత్రను చూసి అంతా తిట్టుకుంటారనీ అదే జరిగితే మాత్రం తాను ఆ పాత్రకి న్యాయం చేసినట్టేనని కావ్య చెబుతోంది. భవాని రవి - రామారావు నిర్మించిన ఈ సినిమాలో సత్యదేవ్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. కీలకమైన పాత్రలో సుహాసిని కనిపించనుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.