Begin typing your search above and press return to search.

తెలుగులో సూర్య క్రేజ్ కు ఇదే నిదర్శనం.. అరుదైన ఫీట్ సాధించిన 'కాటుక కనులే' సాంగ్

By:  Tupaki Desk   |   30 July 2021 1:34 PM GMT
తెలుగులో సూర్య క్రేజ్ కు ఇదే నిదర్శనం.. అరుదైన ఫీట్ సాధించిన కాటుక కనులే సాంగ్
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వైవిధ్యమైన చిత్రాలతో విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానించే స్థాయికి చేరుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకున్న సూర్య.. తెలుగు సినిమాలతో ఈక్వల్ గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయడానికి సూర్య రెడీ అవుతున్నారు. ఇక సూర్య సినిమాలను ఆదరించే తెలుగు ఆడియన్స్.. ఇప్పుడు ఆయన సినిమాలోని సాంగ్ అరుదైన ఫీట్ సాధించేలా చేశారు.

సుధా కొంగ‌ర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ''సూరరై పొట్రు'' చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ''ఆకాశం నీ హద్దురా'' పేరుతో తెలుగు ఆడియన్స్ కి అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని.. అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా 'కాటుక కనులే' పాట తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ నేపథ్యంలో ఈ పాట యూట్యూబ్ లో 100 మిలియన్స్ (10 కోట్ల) వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒరిజినల్ తమిళ వెర్సన్ 'కట్టు పాయలే' సాంగ్ ఇప్పటి వరకు 63 మిలియన్ వ్యూస్ సాధించగా.. దానికి మించి తెలుగు సాంగ్ వ్యూస్ ఉండటం గొప్ప విషమనే చెప్పాలి. దీనిని బట్టే సూర్య కు టాలీవుడ్ లో ఎంతటి పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

'ఆకాశం నీ హద్దురా' చిత్రంలోని 'కాటుక కనులే' సాంగ్ కు జీవీ ప్రకాష్ ట్యూన్ సమకూర్చారు. గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ దీక్షిత (దీ) తనదైన శైలిలో ఆలపించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సాంగ్ లో సూర్య - హీరోయిన్ అపర్ణ బాలమురళి హావభావాలు - డ్యాన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్ రాబడుతోంది. ఈ చిత్రాన్ని సిఖ్య ఎంట‌ర్‌టైన్మెంట్స్ మరియు 2D ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై హీరో సూర్య నిర్మించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు - జాకీష్రాఫ్ - పరేష్ రావల్ - ఊర్వశి ఇతర కీలక పాత్రలు పోషించారు.