Begin typing your search above and press return to search.

బేబి బంప్ తో కెమెరాకి చిక్కిన క‌త్రిన‌

By:  Tupaki Desk   |   17 Aug 2022 3:30 AM GMT
బేబి బంప్ తో కెమెరాకి చిక్కిన క‌త్రిన‌
X
వెంకీ- క‌త్రిన జంట‌గా న‌టించిన‌ `మ‌ళ్లీశ్వ‌రి` 2004లో విడుద‌లైంది. 18 సంవ‌త్స‌రాలు అయినా ఇప్ప‌టికీ ఈ సినిమాలో న‌టించిన క‌త్రిన తెలుగు వారి గుండెల్లో అభిన‌వ మ‌ల్లీశ్వ‌రిగానే నిలిచిపోయింది. అంత‌గా ప్ర‌భావం చూపిన ఈ సొగ‌స‌రి తాను వ‌ల‌చిన సుంద‌రాంగుడు విక్కీ కౌశ‌ల్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగ‌తి తెలిసిందే.

అయితే పెళ్లి త‌ర్వాత‌ క‌త్రిన ఫ్రెగ్నెన్సీ గురించి చాలా ఎక్కువ‌గా ప్ర‌చార‌మైంది. కానీ ఇప్ప‌టికీ ఈ ఫ్రెగ్నెన్సీ మ్యాట‌ర్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు ఈ జంట‌. క‌త్రిన ప్ర‌తిసారీ ప‌బ్లిక్ లోకి వ‌చ్చిన‌ప్పుడు మీడియా త‌న‌ని వెంబ‌డించి బేబి బంప్ ఫోటోల కోసం ఆరాట‌ప‌డుతూనే ఉంది. తాజాగా మ‌రో ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి ఇదిగో క‌త్రిన బేబి బంప్ అంటూ ఒక‌టే ప్ర‌చారం ఊద‌ర‌గొడుతోంది ముంబై మీడియా.

వదులుగా ఉన్న దుస్తులలో కత్రినా కైఫ్ తాజా ఎయిర్ పోర్ట్ లుక్ తో క‌నిపించ‌గానే మళ్లీ అది ప్రెగ్నెన్సీ పుకార్లకు దారితీసింది. కానీ క‌త్రిన ఇన్నిరోజులు ప్రతిసారీ సోషల్ మీడియాలో ఈ పుకార్లను కొట్టిపారేసింది. ఇప్పుడు ఇటీవల కత్రినా వదులుగా ఉన్న ట్రౌజర్ స్వెట్ ష‌ర్ట్ ధరించి విమానాశ్రయంలో కనిపించ‌గా.. ఈ లుక్ ప్రెగ్నెన్సీ పుకార్లను రేకెత్తించింది. ఒక వినియోగదారు ఇలా రాసారు.

``ఆమె గర్భవతిగా కనిపిస్తోంది. ఇది మంచి విషయం`` అని వ్యాఖ్యానించ‌గా.. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు. ``ఫిట్ - ఫ్లాట్ టమ్మీ ఉన్న నటీమణులలో ఆమె ఒకరు. కనుక ఇది (బేబి బంప్) ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నాను`` అని అన్నారు. అభిమానులు త్వరలోనే ఈ జంట అధికారికంగా ఈ విష‌యాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ఈ జంట డిసెంబర్ 9న‌ రాజస్థాన్ లోని రాజ వివాహంలో వివాహం చేసుకున్నారు.

సూప‌ర్ ఉమెన్ అయ్యేదెలా?

క‌త్రిన ఫ్రెగ్నెన్సీ రూమ‌ర్ల అనంత‌రం త‌ను న‌టించే సినిమాల సంగ‌తేమిటీ అంటూ సినీవ‌ర్గాల్లో ఆరాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతానికి స‌ల్మాన్ `టైగ‌ర్ 3` లో త‌న పాత్ర చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన క‌త్రిన యువ‌హీరోల‌తో క‌లిసి `ఫోన్ బూత్` చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేసింది. త‌దుప‌రి టైగ‌ర్ జిందా హై ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ తో సూప‌ర్ ఉమెన్ త‌ర‌హా కాన్సెప్టులో న‌టిస్తుంద‌ని టాక్ వ‌చ్చింది. కానీ ఈ సినిమా చాలా ఆల‌స్య‌మ‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.