బన్ని వర్సెస్ కత్రిన.. ఇదిగో ఇలా హల్చల్

Mon Aug 03 2020 12:00:17 GMT+0530 (IST)

Katrina Kaif sweats it out while cycling with a mask on

మహానగరాల్లో కోవిడ్ విలయం కొనసాగుతోంది. ముంబై టు హైదరాబాద్ ఈ విన్యాసం చూస్తున్నదే. రోజూ వేలాది కేసులు ఊపిరాడనివ్వడం లేదు. ఇలాంటి సన్నివేశంలో ఆరోగ్యానికి రోగనిరోధక శక్తితో బూస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇంట్లోనే ఉంటే కసరత్తు ఎలా?అందుకే చాలామంది సెలబ్రిటీలు వీలున్నన్ని మార్గాల్లో జాగ్రత్త పడుతున్నారు. పార్కు పరిసరాల్లో జాగింగ్ .. సైక్లింగ్ .. వాకింగ్.. అంటూ రెగ్యులర్ వ్యాపకం అలవాటైంది. ఇంతకుముందు హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్యామణి స్నేహతో కలిసి జాగింగ్ చేస్తున్న దృశ్యాలు కెమెరా కంట పడ్డాయి. ఆ తర్వాత ఆ ఫోటోలు అభిమానుల్లో వైరల్ అయ్యాయి.

బన్ని మాత్రమే కాదు టాలీవుడ్ లో చాలామంది స్టార్లు ఆరు బయట జాగింగ్ చేస్తున్నారు. వేకువఝామున జన సందోహం ఉండదు కాబట్టి ఇది బాగానే వర్కవుటవుతోంది. తాజాగా ముంబై గాళ్ కత్రిన కైఫ్ సైక్లింగ్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి. కత్రిన బ్లాక్ స్పోర్ట్ డ్రెస్ లో సైక్లింగ్ చేస్తోంది. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయ్యింది. కాంబినేషన్ బ్లాక్ మాస్కుతో కనిపించింది. కోవిడ్ ని ఎదుర్కొనేందుకు శరీరంలో ఆక్సిజన్ కంటెంట్ సరిపడినంతా కావాలి. తెల్లరక్త కణాల వృద్ధి కసరత్తులతోనే సాధ్యం అని డాక్టర్లు చెబుతుంటే ఇలా సెలబ్రిటీలంతా బయటపడుతున్నారన్నమాట!!  ముంబై గాళ్స్ మలైకా అరోరాఖాన్.. జాన్వి కపూర్ ఈ తరహాలోనే జాగింగ్ బాట పట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.