Begin typing your search above and press return to search.

ఆ నాభి కింద‌కు అంత‌గా జార్చాలా?

By:  Tupaki Desk   |   28 March 2020 4:53 AM GMT
ఆ నాభి కింద‌కు అంత‌గా జార్చాలా?
X
పింకు చీర.. పింకు ర‌విక‌.. స్లీవ్ లెస్ హొయ‌లు.. బొడ్డు కింద దోపుడు.. ఎవ‌ర‌బ్బా ఈ సోయ‌గం.. అంటారా? అంత‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న మల్లీశ్వ‌రినే.. కుర్ర‌కారుకు వేడెక్కించే అందాల విందు చేయ‌డంలో పీహెచ్ డీ ప‌ట్టా పుచ్చుకున్న నెర‌జాన‌.. ది గ్రేట్ క‌త్రిన‌. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీని ఏల్తోంది అంటే దాని వెన‌క క‌ఠోర త‌ప‌స్సు అలాంటిది.

క‌త్రిన అంటేనే రెగ్యుల‌ర్ ఫిట్ నెస్ ఫ్రీక్. షేప్ ఏమాత్రం ఛేంజ్ అయినా కుద‌ర‌దు. ఒంటిని విల్లులా వొంచేస్తూ యోగా చేయ‌డం త‌న ప్రత్యేక‌త‌. అందుకే న‌వ‌న‌వ‌లాడే అందాల‌తో క‌త్రిన ఇచ్చే ట్రీట్ మామూలుగా ఉండ‌దు. ఇంత‌కీ ఈ ఫోటో ఎప్ప‌టిది? అంటే త్రోబ్యాక్ పిక్చ‌ర్ అంటూ వైర‌ల్ భ‌యానీ ఈ అంద‌మైన ఫోటోని షేర్ చేశారు.

రేస్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న గారు తీసిన ఫోటో ఇది. ఇక రేస్ మూవీలో క‌త్రిన అందాల ట్రీట్ గురించి వేరే చెప్పాల్సిందేం ఉంది. నైసుగా క‌వ్విస్తూ పీక‌లు కోసే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌త్రిన ఇర‌గ‌దీసింది. ఆ సినిమా వ‌చ్చి చాలా కాల‌మే అయినా ఇప్ప‌టికీ అదే విధంగా గ్లామ‌ర్ ని మెయింటెయిన్ చేస్తోంది. అందం కించిత్ త‌గ్గినా అస్స‌లు కుద‌ర‌దు అన్న‌ట్టే ఉంటుంది త‌న తీరు. ఇటీవ‌లే భార‌త్ చిత్రంలో న‌టించింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్ తో కలిసి `సూర్యవంశీ` చిత్రంలో నటిస్తోంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా... కరోనా వల్ల వాయిదా పడింది. రంజాన్‌ కానుకగా విడుదల కానుంద‌ని తెలుస్తోంది.