Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : రెడ్‌ కాస్ట్యూమ్స్‌ తో హీటెక్కిస్తోంది

By:  Tupaki Desk   |   1 Jun 2020 9:30 AM GMT
క్లిక్‌ క్లిక్‌ : రెడ్‌ కాస్ట్యూమ్స్‌ తో హీటెక్కిస్తోంది
X
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అమ్మడి క్రేజ్‌ మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికి ఈ అమ్మడు వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె సినిమాలో ఉందంటే ప్రేక్షకులు అదనపు ఆసక్తి చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఇక అవార్డు వేడుకలకు మరియు ఇతరత్ర వేడుకలకు ఈ అమ్మడు ధరించే కాస్ట్యూమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

కత్రీనా కైఫ్‌ ఇటీవల వరుసగా రెడ్‌ మోడ్రన్‌ డ్రస్‌ లతో నెట్టింట వైరల్‌ అయ్యింది. ముద్దు గుమ్మలు రెడ్‌ డ్రస్‌ లో మరింత అందంగా కనిపిస్తారు అనే విషయం గతంలో చాలా మంది నిరూపించారు. ఇప్పుడు ఆ విషయాన్ని మరింతగా నిరూపితం చేసింది కత్రీనా. బాలీవుడ్‌ లో సల్మాన్‌ ఖాన్‌ చిత్రంతో పాటు ప్రస్తుతం పలు చిత్రాలకు కమిట్‌ అయ్యింది. ఇంకా కొన్ని చర్చల దశలో కూడా ఉన్నాయి. ఆమద్య కాస్త డల్‌ అయినట్లుగా కనిపించినా మళ్లీ వరుసగా చిత్రాలు చేస్తూ తన స్టార్‌ డంను నిలుపుకుంది.

తెలుగులో కూడా నటించి మెప్పించిన కత్రీనాకు సౌత్‌ లో భారీ అభిమానులే ఉన్నారు. ఈ అమ్మడు చేసే సినిమాలకు సౌత్‌ లో మంచి క్రేజ్‌ ఉంటుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ లో ప్రత్యేక స్థానం ఈ అమ్మడిది అని చెప్పుకోవచ్చు. సినిమాలతోనే కాకుండా ప్రేమ వ్యవహారాలతో కూడా ఎప్పుడు వార్తల్లో ఉండే కత్రీనా ఈసారి రెడ్‌ డ్రెస్‌ లతో హీటెక్కిస్తూ మీడియాలో నిలిచింది.