పెళ్లి అయిన తర్వాత కూడా స్విమ్ డ్రెస్ లో మతి పోగొడుతోంది

Tue Jan 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Katrina Kaif Photo Talk

నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. హీరోయిన్ గా ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత విషయంలో రెండు పదుల వయసు వారితో సమానంగా పోటీ పడుతూ ఉంది.పెళ్లి అయిన తర్వాత హీరోయిన్స్ గ్లామర్ విషయంలో కాస్త తగ్గుతారు. కానీ కత్రీనా కైఫ్ విషయంలో అలా ఏమీ కాలేదు. విక్కీ కౌషల్ ను వివాహం చేసుకున్న ఈ అమ్మడు ఇంకా కూడా అందాల ఆరబోత విషయంలో యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది.

తాజాగా ఇలా స్విమ్ సూట్ లో ఆకట్టుకుంది. స్విమ్మింగ్ పూల్ లో జుట్టు అలా సర్దుకుంటూ నడుము అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో తో మతి పోగొడుతోంది. కవ్వించే ఫోజ్ తో ఈ అమ్మడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.

కత్రీనా కైఫ్ గత ఏడాది ఫోన్ బూత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది మెరీ క్రిస్మస్ మరియు టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

హీరోయిన్ గా ఈ అమ్మడు ఈ వయసులో కూడా ఇంత బిజీగా ఉండటం నిజంగా ఆశ్చర్యం. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కనుకే కత్రీనాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.         నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.