వరల్డ్ ఎర్త్ డే 2021: కత్రిన కైఫ్ కనిపెట్టిన సుందర దేశం

Thu Apr 22 2021 14:06:10 GMT+0530 (IST)

Katrina Kaif Latest Stunning Pose

ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న కత్రిన ఈ లాక్ డౌన్ కాలంలో ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నారు. ఈ తీరిక సమయాన్ని తనదైన శైలిలో సద్వినియోగం చేస్తున్నారు. కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా తాజాగా కత్రిన ఇన్ స్టాలో త్రోబాక్ ఫోటోను షేర్ చేశారు. భూమిపై `చాలా అందమైన ప్రదేశాలలో ఒకటి` అని ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు.ఈ ఫోటోలో పర్పుల్ కిమోనో డిజైనర్ దుస్తులలో కత్రిన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఈ డ్రెస్ కి తగ్గట్టే చంకీ కంకణాలు .. చమత్కారమైన నెక్ పీస్ తో లుక్ ఆసక్తిని కలిగించింది. ఈ లుక్ పూర్తిగా వెస్ట్రన్ స్టైల్లో బోల్డ్ గా కనిపిస్తోంది.

``చాలా అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. మీరు ఇలాంటి రోజులను ఆస్వాధిస్తున్నారని అనుకుంటున్నా. వేరే ఎవరూ ఆరోజు నాలా ప్రకృతితో లేరు..`` అంటూ కత్రిన ఆనందం వ్యక్తం చేసారు. ఆల్వేస్ వేర్స్ ది కలర్స్ ఆఫ్ ది స్పిరిట్ అనే వాల్డో కొటేషన్ ని.. లుక్ డీప్ ఇన్ టు నేచుర్ అండ్ యు విల్.. అనే ఆల్బర్ట్ కొటేషన్ ని కత్రిన షేర్ చేశారు. కత్రిన తదుపరి టైగర్ 3 సహా అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించే సూపర్ ఉమెన్ సిరీస్ లోనూ నటించాల్సి ఉంది.