Begin typing your search above and press return to search.

క‌త్తి లాంటి చూపుల‌తో కాక‌లు పుట్టిస్తోంది

By:  Tupaki Desk   |   22 Jan 2021 4:30 PM GMT
క‌త్తి లాంటి చూపుల‌తో కాక‌లు పుట్టిస్తోంది
X
మ‌ల్లీశ్వ‌రిగా తెలుగు వారికి సుప‌రిచిత‌మైన క‌త్రిన ఆ త‌ర్వాత బాల‌కృష్ణ‌ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. ఆ త‌రవాత మ‌ళ్లీ ఇటువైపు రాకుండా.. బాలీవుడ్ కే అంకిత‌మైంది. అక్క‌డ భాయ్ స‌ల్మాన్ స‌ర‌స‌న వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే న‌వ‌త‌రం హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ఇటీవ‌ల ట్యాలెంటెడ్ విక్కీ కౌశ‌ల్ తో డీప్ గా ల‌వ్ లో ఉంద‌న్న ప్ర‌చారం సాగినా దానికి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు.

అదంతా అటుంచితే.. క‌త్రిన ప్ర‌స్తుతం సొంత కంపెనీ.. కే బై క‌త్రిన సౌంద‌ర్య ఉత్ప‌త్తుల బ్రాండ్ ని ప్ర‌మోట్ చేయ‌డంలో బిజీబిజీగా ఉంటోంది. భారీగా ఫ్రాంఛైజీల‌తో ఈ బ్రాండ్ ని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించే ప్ర‌ణాళిక‌ల్లో ఉందిట‌. కే బ్రాండ్ తో మేక‌ప్ లుక్ ఎలా ఉంటుందో తాజాగా మ‌రోసారి క‌త్రిన త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేసింది. క్యాట్ లేలేత అందాల్ని ఈ మేక‌ప్ కిట్ ఎలివేట్ చేయ‌డంలో స‌మ‌ర్థంగా వ‌ర్క‌వుట్ చేసింది. నిజానికి 40 కి చేరువైనా క‌త్రిన‌లో ఇంకా టీనేజీ మిస‌మిస‌ల‌కు కే ప్రొడ‌క్ట్స్ కార‌ణ‌మా? అంటూ యూత్ లో కౌంట‌ర్లు ప‌డిపోతున్నాయ్ మ‌రి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కత్రినా కైఫ్ - సిద్ధాంత్ చతుర్వేది- ఇషాన్ ఖట్టర్ కాంబినేష‌న్ లో ఓ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోంది. ‘ఫోన్ భూత్ అనేది టైటిల్. త‌దుప‌రి స‌ల్మాన్ స‌ర‌స‌న‌ టైగ‌ర్ 3లోనూ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. టైగ‌ర్ జిందా హై ద‌ర్శ‌కుడితో సూప‌ర్ గాళ్ పాత్ర‌తో వేరొక భారీ చిత్రం పైప్ లైన్ లో ఉంది.