ఫోటో స్టోరీ: గుబులు రేపుతున్న కత్రిన

Fri Sep 20 2019 07:00:01 GMT+0530 (IST)

Katrina Kaif Glamourous Pose

35 ప్లస్ వయసులోనూ టీనేజీ మిసమిసలతో హొయలు పోవడంలో అందాల కత్రినకే చెల్లింది. ఈ అమ్మడు మిడిలేజీలోనూ మిలమిల మెరుపులతో కుర్రకారును వెర్రెత్తిస్తోంది. ఇటీవలే ఐఫా 2019 ఉత్సవాల్లో రెడ్ కార్పెట్ నడకలతో వయ్యారాల వడ్డనలు చేసిన కత్రిన రెడ్ డ్రెస్ లో అదరగొట్టింది. మరోసారి అదిరిపోయే ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.తాజాగా రివీల్ చేసిన ఫోటోల్లో కళ్లు చెదిరే రూపలావణ్యంతో కత్రిన మైమరిపించింది. మిరుమిట్లు గొలిపే ఛమ్కీల డ్రెస్ లో ఆ నాభి అందాల్ని ఆవిష్కరించిన తీరుకు పరేషాన్ అవ్వాల్సిందే. ఈ ఫోటోలు కూడా ఐఫా వేడుకల నుంచి వచ్చినవే. అప్పటికప్పుడే కత్రిన అదిరిపోయే డిజైనర్ లుక్ లోకి మారిపోయి రకరకాల గెటప్పులతో చూపరులను కట్టి పడేసిందని అర్థమవుతోంది.

కత్రిన తో పాటు ఐఫా 2019 ఉత్సవాల్లో పలువురు అందగత్తెలు వయ్యారాల వడ్డనలు చేశారు. రకుల్ ప్రీత్ గోల్డెన్ డ్రెస్ ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిచా చద్దా- రాధిక మందన్- జెనీలియా- శ్రద్ధా కపూర్ తదితరులు ఈ వేడుకలో ప్రత్యేకంగా డిజైనర్ లుక్ లో కనిపించి మైమరిపించారు. సల్మాన్ ఖాన్- విక్కీ కౌశల్- రితేష్ దేశ్ ముఖ్ సహా పలువురు స్టార్ హీరోలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.