Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కత్రినా.. కత్తి లాంటి బర్త్ డే ట్రీట్

By:  Tupaki Desk   |   16 July 2019 9:10 AM GMT
ఫోటో స్టొరీ: కత్రినా.. కత్తి లాంటి బర్త్ డే ట్రీట్
X
బాలీవుడ్ లో ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగడం సాధారణ విషయమేమీ కాదు. అతి తక్కువ మందికి మాత్రమే అలాంటి ఫీట్ సాధ్యమవుతుంది. కత్రినా కైఫ్ సరిగ్గా అలాంటిదే ఘనతే సాధించింది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ 'భారత్' తో ఘనవిజయం సాధించింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో మహా దిట్ట. హాట్ ఫోటోలు పోస్ట్ చేసిందంటే ఒకేసారి సోషల్ మీడియా టెంపరేచర్లు పది డిగ్రీలు పెరుగుతాయి.

తాజాగా ఈ ఉష్ణోగ్రతల పెంపు కార్యక్రమాన్ని మరోసారి చేపట్టింది. రోజూ వచ్చే ఫోటోలు వేరు.. ఈరోజు వేరు ఎందుకంటే.. టుడే ఈజ్ కత్రినా బర్త్ డే. అందుకే స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేస్తూ "కేక్ +MX = లవ్" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. కేక్ లవ్ అనే పదాలను అక్షరాలతో కాక్జుండా 'కేకుపై ఒక క్యాండిల్' ఎమోజీ'.. 'లవ్ సింబల్' ఏమోజిల తో ఒక కొత్త సూత్రాన్ని నెటిజన్లకు పరిచయం చేసింది. కాకపోతే కష్టమైన బీకాం ఫిజిక్స్ ఫార్ములాస్ లాగా ఇది కూడా అర్థం అయ్యేలా లేదు. ఆ MX ఏంటో చెప్పి పుణ్యం కట్టుకుంటే ఎంతో బాగుండేది. ఎదైతేనేం.. ఫోటో మాత్రం కత్తిలా ఉంది.. అదిరిపోయింది. బికిని ధరించి దానిపై రోప్స్ డిజైన్ ఉండే ఒక వైట్ డ్రెస్ ను ధరించి ఒక బీచ్ లో నిలుచుంది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి యాక్సెసరీస్ ఏవీ ధరించకుండా ఎంతో సహజంగా పోజిస్తూ ఒక సెక్సీ స్మైల్ ఇచ్చింది.

క్రేజీ బాలీవుడ్ బ్యూటీ కావడంతో నెటిజన్లు బర్త్ డే మేసేజులతో హోరెత్తించారు. వాటితో పాటుగా ఈ ఫోటోకు కామెంట్లు కూడా పెట్టారు. "సిజ్లింగ్ హాట్ బేబీ".. "ఆల్వేస్ గ్లామర్ క్వీన్".. "యాజ్ యూజువల్ స్టన్నింగ్" అంటూ కామెంట్లు వచ్చాయి. కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి.