యువహీరో ప్రేమలో కత్రిన.. గుట్టు అలా లీక్!

Wed Jan 22 2020 14:18:20 GMT+0530 (IST)

Katrina Kaif Dating With Young Hero

ప్రేమలో ఉన్నప్పుడు దాగుడు మూతలు తప్పదు. పైగా బాలీవుడ్ మీడియాకి ఏమాత్రం దొరికిపోయినా ఇక ఖతం అయినట్టే. అందుకే బాలీవుడ్ కథానాయికలు తమ ప్రేమ వ్యవహారాల్ని వెంటనే ఓపెన్ చేసేందుకు ఇష్టపడరు. ఒకసారి దొరికితే ఇక బడితెపూజకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఉన్నవి లేనివి అవాకులు చవాకులు ప్రచారం అయిపోతాయి.ప్రస్తుతం అలాంటి డైలమాలోనే ఉందిట కత్రిన కైఫ్. ఈ అమ్మడు ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో ఫెయిల్. ఇప్పుడు మరో యువహీరోతో ప్రేమలో పడడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ భాయ్ తో లవ్ బ్రేకప్ అయ్యాక చాక్లెట్ బోయ్ రణబీర్ తో నిండా ప్రేమలో మునిగిన ఈ అమ్మడు అతడిని పెళ్లాడి లైఫ్ లో సెటిలవ్వాలని చాలానే కలలుగంది. కానీ రణబీర్ లోని రోమియా వేషాలకు తట్టుకోలేకపోయిన కత్రిన అతడికి దూరమైంది. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటోంది. ఏదో తన స్నేహితుడు సల్మాన్ వరుసగా సినిమాల్లో ఛాన్సులివ్వడంతో కెరీర్ పరంగా బిజీ అయిపోయి అన్నిటినీ మర్చిపోయింది. అయితే ఈలోగానే యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం సాగించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

గత కొంతకాలంగా విక్కీతో హ్యాంగవుట్లకు సంబంధించిన ఫోటోలు లీకవుతున్నాయి. మంగళవారం ముంబైలోని ఓ స్నేహితుడి ఇంట్లో విక్కీని కత్రిన రహస్యంగా కలుసుకున్న మ్యాటర్ ప్రస్తుతం వేడెక్కిస్తోంది. ఇంతకుముందు దీపావళి పార్టీలో తళుక్కుమన్న ఈ జంట.. అటుపైనా డిన్నర్ డేట్ల పేరుతో రెస్టారెంట్లలో జంటగా కనిపించారు. ఇక అర్థరాత్రి వేళ ఆ ఇద్దరి స్నేహాన్ని చెఫ్ లు ఫోటోలు వీడియోలు తీసి ఆన్ లైన్ లో పెట్టేయడంతో అసలు గుట్టు కాస్తా బయటపడిపోయింది. తాజాగా మరోసారి విక్కీ కౌశల్ ని అర్థరాత్రి రహస్యంగా కలుసుకోవడం ఆ ఫోటోలు లీకవ్వడం హీటెక్కిస్తోంది. మంగళవారం రాత్రి అత్యంత రహస్యంగా ఈ జంట వేర్వేరు కార్లలో ముంబైలోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చి కలవడం వేడెక్కిస్తోంది.