క్యాట్ కాపీ డ్యాన్స్ వైరల్

Tue Feb 23 2021 08:41:35 GMT+0530 (IST)

Katrina Kaif Copy Dance Viral?

బాలీవుడ్ హాట్ బ్యూటీ సౌత్ ప్రేక్షకులకు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన కత్రీనా కైఫ్ తన హాట్ ఐటెం సాంగ్స్ తో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈమె ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈమె వీడియోలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు లక్షల్లో ఉంటారు. తాజాగా ఈమె చేసిన ఒక  డాన్స్ మూమేంట్ మరో సారి ఆమెను టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మార్చేసింది. స్టే ఎట్ హోమ్ అనే థీమ్ తో కత్రీనా చేసిన డాన్స్ ఆకట్టుకుంది.హాలీవుడ్ స్టార్ జాక్ బ్లాక్ దాదాపు ఏడాది క్రితం స్టే హోమ్.. స్టే హోమ్ అంటూ ఒక సందేశాత్మక పాటతో కూడిన డ్యాన్స్ వీడియోను షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. దాన్ని ఎంతో మంది తమదైన శైలిలో చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు కత్రీనా కైఫ్ ఆ డాన్స్ ను చేయడం జరిగింది. ఇప్పుడు కరోనా పరిస్థితి అంత సీరియస్ గా ఏమీ లేదు. స్టే హోమ్ నినాదాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అయినా కూడా కత్రీనా కైఫ్ ఇప్పుడు స్టే ఎట్ హోమ్ అంటూ చేసిన డాన్స్ ను జనాలు తెగ వైరల్ చేస్తున్నారు. కాపీ చేసిన వీడియో అయినా కూడా జనాలు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.