Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఐఫాలో గ్రీకు దేవత

By:  Tupaki Desk   |   17 Sep 2019 7:43 AM GMT
ఫోటో స్టొరీ: ఐఫాలో గ్రీకు దేవత
X
బాలీవుడ్ లో ఉన్నఒక ఎవర్ గ్రీన్ బ్యూటీ కత్రినా కైఫ్. ఎవర్ గ్రీన్ ఎందుకంటే సినిమా హీరోయిన్ల కెరీర్ స్పాన్ ఐదేళ్ళు.. మహా అయితే పదేళ్ళు.. కానీ కత్రిన మాత్రం 15 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇంకా జోరు తగ్గడం లేదు. క్రేజు కూడా తగ్గడం లేదు. గ్లామర్ అయితే ఇంకా పెరిగింది.. అందుకే కత్రినా ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తే లైక్స్ సునామీ వస్తోంది. కామెంట్స్ తుఫాను వస్తోంది.

కత్రినా తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "IIFA" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ముంబైలో నిన్న ఐఫా కు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు చాలామంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కత్రినా కూడా హాజరయింది. లాంగ్ కోటు లాంటి రెడ్ కలర్ డిజైనర్ గౌన్ ధరించి హొయలు పోతూ కార్పెట్ పై నడిచింది. ఇక డ్రెస్ ఎలా ఉందంటే విండోస్ 2019 వెర్షన్ లాగా ఉంది. సైడ్ నుంచి వెనక వరకూ ఓ పెద్ద విండో ఉంది. మనకు బాలీవుడ్ లో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఉన్నాడు కానీ గ్రీక్ గాడెస్ లేదని ఇప్పటివరకూ కళాభిమానులు భాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే ఆ గ్రీకు దేవత కత్రినా రూపంలో బాలీవుడ్ లో ఉందేమో.. మనం గుర్తించడం లేదేమో అనిపిస్తోంది. ఆ ఒంపుసొంపులు.. ఆ హెయిర్ స్టైల్.. ఆ మేకప్.. ఆ సెక్సినెస్.. కత్రినాకు సాటి లేదు.. పోటీ అసలే లేదు.

ఈ ఫోటోలకు నెటిజన్లు తెగ లైక్స్ కొట్టారు. రెచ్చిపోయి కామెంట్స్ పెట్టారు. "క్యాట్ ప్లీజ్ స్టాప్.. ఎగ్జామ్స్ ఉన్నాయి".. "ఐఫాలో చచ్చారు జనాలు".. "బ్లెస్సింగ్ ఫర్ బాలీవుడ్".. "హాట్ నెస్ అంటే కత్రినా" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది.