టాప్ స్టోరి: అంగుళీకం తొడిగిన వేలు చాలా ఖరీదు!

Wed Jul 06 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Katrina Kaif Alia bhatt massive engagement rings

పెళ్లాడే ముందే వలపుల రాణికి అదిరిపోయే అంగుళీకం (ఉంగరం) కానుకివ్వాలి వరుడు. నిశ్చితార్థపు రింగ్ కానీ వివాహంలో తొడిగే రింగులు కానీ ఎంతో ఖరీదైన ఎంపికలు అన్నది తెలిసిందే. ఇక సెలబ్రిటీ ప్రపంచంలో కాస్ట్ ఫ్యాక్టర్ అన్నది నామమాత్రమే. కోట్లాది రూపాయల విలువ చేసే ఉంగరాల్ని చిటికిన వేలికి తొడిగేయడం ఇక్కడ చాలా సహజం.ఖజానాలో కొన్నామా? మలబారులో కొన్నామా? అన్నది ఇంపార్టెంట్ కాదు. ఖరీదు ఎంత.. లుక్ ఏ రేంజు అన్నదే వధూవరులు చూస్తున్నారు. రిలయన్స్ అంబానీల పెళ్లిళ్లలో బాలీవుడ్ టాలీవుడ్ గ్లిజ్ వరల్డ్ లో సెలబ్రిటీ వెడ్డింగుల్లో ఇలాంటివి సహజంగా చూస్తుంటారు అభిమానులు.

ఇప్పటివరకూ అత్యంత ఖరీదైన వజ్రపు అంగుళీకాల్ని కానుకలుగా పొందిన భామల జాబితాను తిరగేస్తే ..ఆలియా భట్- ప్రియాంక చోప్రా - అనుష్క శర్మ-కాజల్- కత్రిన- నయనతార సహా దాదాపు పది మంది అందాల నాయికల జాబితా ఇలా ఉంది. వీళ్లు ధరించిన నిశ్చితార్థ లేదా వివాహ ఉంగరాలు టూమచ్ కాస్ట్ లీ అన్న టాక్ ఉంది.

ట్యాలెంటెడ్ ఆలియా భట్ తాను వలచిన రణబీర్ కపూర్ ని ఏప్రిల్ లో పెళ్లాడింది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కానున్నారు. రణబీర్ - అలియా ఘనమైన వివాహాన్ని చేసుకున్నారు. రణబీర్ కపూర్ తన లేడీ లవ్ కోసం అత్యంత ఖరీదైన పరిమాణంలో పెద్దగా ఉన్న డైమండ్ రింగ్ ని కానుకగా అందించాడు.  అలియా ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా ఆమె వివాహ ఉంగరం స్పష్టంగా కనిపించింది. వజ్రం పరిమాణం ఖచ్చితంగా రణబీర్ తన లైఫ్ టైమ్ లవ్ ని వ్యక్తపరిచేంత పెద్దగా ఉంది.  దీనికోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసాడని టాక్ ఉంది.

అందాల కత్రిన కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కత్రినకు పెళ్లిలో ఖరీదైన కానుకలు ముట్టాయి. తన వివాహ ఉంగరం ఫోటోల్లో వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. రూ. 7.5 లక్షల (USD 9800) విలువైన టిఫానీ సోలెస్టే బ్రాండ్ ని ఎంచుకుంది. ఉంగరం చుట్టూ చిన్న వజ్రాలతో పొదిగిన అసలైన నీలిరంగు వజ్రం తళతళా మెరిసింది. దీంతో పాటు ఖరీదైన వజ్రపు ఉంగరం విక్కీ నుంచి పెళ్లికి ముందే స్పెషల్ కానుకగా అందిందట.

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ 2018 లో రాజస్థాన్ ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు. ఇది చాలా ఆడంబరంగా జరిగిన పెళ్లి. పెండ్లి ఆ రేంజులో జరిగింది అనుకుంటే పీసీ పెళ్లి ఉంగరం ఖరీదు ఎంతో ఊహించుకోవచ్చు. ఈ ఉంగరం ఖరీదు రూ. 2.1 కోట్లు అని తెలిసింది.

దీపికా పదుకొణె 2018లో ఇటలీలోని లేక్ కోమోలో రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. దీపిక ధరించిన ప్లాటినం రింగ్  దీర్ఘచతురస్రాకార సాలిటైర్ ను కలిగి ఉంది. ఆమె ఉంగరం ధర రూ.1.3 కోట్ల నుండి రూ.2.7 కోట్ల రేంజులో విలువ చేస్తుందని సమాచారం.

కరీనా కపూర్ ఖాన్ 2012లో సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకుంది. బెబో ఘనమైన వేడుకకు భారీగా అతిథులు విచ్చేసారు. పటౌడీ సంస్థాన బేగం రేంజుకు తగ్గట్టే తన పెళ్లి కోసం 75 లక్షల రూపాయల విలువైన ఉంగరాన్ని కానుకగా పొందింది.

అనుష్క శర్మ -విరాట్ కోహ్లీ త్వరలో తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం చిన్నారి వామికకు తల్లిదండ్రులు అన్న సంగతి తెలిసిందే. అనుష్క ఉంగరం విలువ కోటి రూపాయలు అని ప్రచారం సాగుతోంది.

తన కుటుంబం కోసం నటనకు దూరంగా ఉన్న  మేటి దక్షిణాది హీరోయిన్ అసిన్ వ్యాపారవేత్త రాహుల్ శర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతడు అక్షయ్ కుమార్ కి స్నేహితుడు. అశిన్ ఇప్పటివరకూ కాస్ట్ లీ వెడ్డింగ్ రింగ్ ని ధరించిన తారగా గుర్తింపు పొందింది. 20 క్యారెట్ల సాలిటైర్ ఉంగరం దాదాపు 6 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ధరించిన వజ్రపు ఉంగరం ఖరీదు కోట్లలోనే. గౌతమ్ కిచ్లు ఇండస్ట్రీలో టాప్ బిజినెస్ మేన్ కావడంతో తన రేంజుకు తగ్గ వజ్రపు ఉంగరాన్ని కానుకిచ్చాడు. ఈ జంట ఒక బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవలే విఘ్నేష్ శివన్ అందాల నయనతారను పెళ్లాడాడు. తనకు అత్యంత ఖరీదైన వజ్రపు ఉంగరాన్ని అతడు కానుకగా ఇచ్చాడు. అలాగే నేహా ధూపియా .. శిల్పా శెట్టి .. దియా మిర్జా సహా పలువురు అందాల కథానాయికలు పెళ్లికి ఖరీదైన ఉంగరాల్ని కానుకలుగా అందుకున్నారు.