ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా యంగ్ హీరో

Mon Sep 21 2020 23:07:43 GMT+0530 (IST)

Young Hero as Investigation Officer

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కార్తికేయ సినిమాలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈయన చావు కబురు చల్లగా సినిమాను చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. నేడు కార్తికేయ బర్త్ డే సందర్బంగా విడుదల అయిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇది కాకుండా తమిళంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇదే సమయంలో కొత్త సినిమాను కార్తికేయ ప్రకటించాడు.నేడు కార్తికేయ పుట్టిన రోజు సందర్బంగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాలో కార్తికేయ ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. యంగ్ హీరోలు ఇలాంటి పాత్రలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ఒక కేసు చుట్టు తిరుగుతుందని తాజాగా విడుదల అయిన పోస్టర్ ను బట్టి అర్థం అవుతుంది. ఆ కేసు ఏంటీ.. ఈ సినిమా టైటిల్ ఏంటీ.. ఇతర విషయాలు త్వరలో వెళ్లడి చేస్తాం అన్నట్లుగా పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.