రాఖీ..టెంపర్ చూసి ఎమోషన్ ప్రాక్టీస్ చేసేవాడిని!

Fri Dec 06 2019 17:16:27 GMT+0530 (IST)

Kartikeya Follows NTR For Emotional Scenes in Movies

'RX 100'  సినిమాతో హీరోగా పరిచయమై అందరినీ మెప్పించిన కార్తికేయ తాజాగా '90ML' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.  ఈ సినిమా టైటిల్.. హీరో పాత్రపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే "ఈ సినిమాలో ఎక్కడా ఆల్కహాల్ ను ప్రమోట్ చేసినట్టు ఉండదు. హీరోకు ఒక డిజార్దర్ ఉంటుంది. అందుకే తాగుతాడు. సరదా కోసం ఒక్క సీన్లో కూడా మద్యం సేవించడు" అంటూ వెల్లడించారు.హీరోగా మారక మునుపు మీ అభిమాన హీరో ఎవరని అడిగితే "చిరంజీవి గారే.  ఆయన ఫైట్లు.. డ్యాన్సులు చూసే నాకు సినిమా పిచ్చి ఏర్పడింది. అయితే  ఇప్పుడు మాత్రం ఒక్కో హీరోలో ఒక్కో క్వాలిటీ నాకు నచ్చుతుంది. చిరంజీవి గారు డ్యాన్స్. ప్రభాస్ గారు అంటే ఫైట్స్.. ఎమోషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు" అంటూ తనకిష్టమైన హీరోల గురించి వెల్లడించారు.  'రాఖీ'.. 'టెంపర్' సినిమాలలో ఎన్టీఆర్ ఎమోషన్ ను చూసి యాక్టింగ్ ప్రాక్టిస్ కూడా చేసినట్టు కార్తికేయ వెల్లడించారు.

'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ పాత్రలో నటించడం గురించి మాట్లాడుతూ పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఇప్పటికీ విలన్ రోల్ చేసేందుకు సిద్దమని చెప్పాడు. అయితే ఇలా వచ్చి అలా పోయే సీన్ అయితే ఎవరి సినిమాలో అయినా చేయనని క్లారిటీ ఇచ్చారు.  పెద్దగా లెక్కలేసుకుని అది చెయ్యాలి.. ఇది చెయ్యాలని సినిమాలు ఒకే చెయ్యడం లేదని.. మనసుకు నచ్చినని చేసుకుంటూ వెళ్తున్నానని తెలిపారు.