కార్తీక దీపం ది ఎండ్.. బిగ్గెస్ట్ రికార్డ్

Tue Jan 24 2023 11:01:49 GMT+0530 (India Standard Time)

Kartika Deepam The End.. Biggest Record

సుమారు ఐదేళ్ల ముందు నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కార్తీకదీపం సీరియల్ ఎట్టకేలకు ముగిసింది. అక్టోబర్ 16వ తేదీ 2017 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సీరియల్ లో నిరుపమ్ పరిటాల ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రధారులుగా కనిపించారు. ఈ సినిమాలో శోభా శెట్టి అర్చన సహా బిగ్ బాస్ ఉమాదేవి వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించారు. ఒకానొక దశలో ఈ సీరియల్ ఎంతగా పాపులర్ అయిందంటే సినిమాల్లో కూడా ఈ సినిమా రిఫరెన్సులు చూపిస్తూ ఉండేవారు. మలయాళ టెలివిజన్ పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాధ్ ని తెలుగు టెలివిజన్ పరిశ్రమకు తీసుకువచ్చి మరి.. ఈ పాత్ర ఆమె చేత చేయించి అందరూ ఔరా అనిపించేలా సీరియల్ నడిపారు. వంటలక్క అనే పాత్రలో ప్రేమి విశ్వనాధ్ను తెలుగు వారందరూ ఓన్ చేసుకున్నారు.

నిరూపమ్ డాక్టర్ బాబు అనే పాత్రలో కనిపించగా ఆయన భార్య పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటించిన వీరిద్దరి జీవితంలోకి మౌనిత అనే పేరుతో వచ్చిన శోభా శెట్టి..  డాక్టర్ బాబు అనబడే నిరూపమ్ను దక్కించుకోవడం కోసం అనేక స్కెచ్ లు వేస్తూ ఉంటుంది.

వాటిని ఎప్పటికప్పుడు వంటలక్క భగ్నం చేస్తూ వచ్చేది. ఒకప్పుడు సినిమాలకు దర్శకత్వం వహించిన కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ కు దర్శకత్వం వహించారు. తెలుగులో మరే సీరియల్ కు రానంత పాపులారిటీ దక్కించుకుంది.

సుమారు 1926 ఎపిసోడ్లు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల రెండున్నర నెలల పాటు ఈ సీరియల్ సాగింది. అంటే తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ ని ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.

ఈ సీరియల్ మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ ఆధారంగా తెరకెక్కించబడినా తెలుగువారికి తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేసి తీసుకువచ్చారు. ఇక ఇప్పటివరకు తెలుగులో అత్యధిక కాలం ప్రసారమైన సీరియల్ గా అభిషేకం సీరియల్ ఉండగా ఆ తర్వాత ఆడదే ఆధారం మనసు మమత చక్రవాకం మొగలిరేకులు చి.లా.సౌ స్రవంతి వంటి సీరియల్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ సీరియల్ కి సంబంధించి రెండో భాగం కూడా ప్రసారమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా అందులో నిజం ఎంత ఉందో కాలమే నిర్ణయించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.