`దోస్తానా` జంట లవ్ లోనే ఉన్నారా.. టాటా చెప్పారా?

Sat Jul 31 2021 15:00:41 GMT+0530 (IST)

Is 'Dostana' couple still in love

అతిలోక సుందరి  శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ -  బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ మధ్య ప్రేమాయణం ఇంకా కొనసాగుతుందా?  లేక విడిపోయారా? .. దీనిపై ఇంకా క్లారిటీ దొరికలేదు. ఈ జోడీ కరణ్ జోహర్ నిర్మిస్తోన్న దోస్తానా-2 లో హీరో- హీరోయిన్లగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇరువురు ప్రేమలో పడ్డట్లు బాలీవుడ్ మీడియా వేడెక్కించింది. అయితే కొంత షూటింగ్ జరిగిన తర్వాత  ఉన్నట్లుండి కార్తిక్ ఆర్యన్ ని కరణ్ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. అప్పటికే పూర్తయిన షూట్ ని స్క్రాప్ లోకి తొసేసి మళ్లీ రీషూట్ కూడా చేసారు. అయినా ఎందుకనో కరణ్ అవుట్ పుట్ విషయంలో సంతృప్తి చెందక చివరికి కార్తీక్  ఆర్యన్ ని ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. కార్తీక్ ఆర్యన్ క్రమశిక్షణ పైనా నిందలు వేశారు.ప్రస్తుతం అతని స్థానంలో మరో హీరో నటిస్తున్నాడు. దీంతో  జాన్వీ- కార్తీక్ ప్రేమాయణం కూడా పుల్ స్టాప్ పడినట్లు ప్రచారం సాగింది. ఆన్ సెట్స్ వరకేనా ఈ ప్రేమాయణం..? అంటూ కథనాలు వెలువడ్డాయి. ఇంతకుముందు ఇద్దరూ కలిసి డిజైనర్ మనీష్ మల్హోత్రా 2021 న్యూ ఇయర్ పార్టీకి హాజరయ్యారు. అది అకేషనల్ అని అంతా అనుకున్నారు. అయితే ఈ జంట ఆ తర్వాత కూడా ఓ వెకేషన్  స్పాట్ లో కలిసి కనిపించడంతో ప్రేమ గీమా అంటూ ప్రచారం హీటెక్కించింది.

హాట్ పెయిర్  గోవాలో ఓ రిసార్ట్ లో ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో సన్నిహితంగా మెలుగుతోన్నో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇద్దరు ఒకే డ్రెస్ కోడ్ వైట్ అండ్ వైట్ లో తళుక్కున మెరిసారు. ఈ  ఫోటో ని ఉద్దేశించి ఇన్ స్టా ఫాలోవర్స్  కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. సడెన్ గా ఈ సర్ ప్రైజ్ దోస్తానా? ఏంటని ఆసక్తికర కామెంట్లు  చేసారు. అయితే ఇది త్రోబ్యాక్ ఫోటో మాత్రమే. లేటెస్ట్ మీటింగ్ ఏదీ ఆ ఇద్దరికీ కుదరలేదు. అందుకే ఇటీవల ఆ ఇద్దరిపై గాసిప్స్ కూడా రావడం తగ్గింది. ప్రేమ కథ అక్కడితో ముగిసినట్టేనా? అంటూ మరో ఆసక్తికర చర్చ యూత్ లో తెరపైకొచ్చింది.