Begin typing your search above and press return to search.

అన్నాచెల్లెళ్లు 'గే' ని ప్రేమిస్తారా? హ‌వ్వ‌!!

By:  Tupaki Desk   |   20 July 2019 1:30 AM GMT
అన్నాచెల్లెళ్లు గే ని ప్రేమిస్తారా? హ‌వ్వ‌!!
X
బాలీవుడ్ లో `గే` కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన `దోస్తానా` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి భాగంలో జాన్ అబ్ర‌హాం- అభిషేక్ బ‌చ్చ‌న్- బాబీ డియోల్- ప్రియాంక చోప్రా ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. గే ల‌వ్ స్టోరితో తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ యువ‌త‌రంలో నేటికీ హాట్ టాపిక్. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ని తెర‌కెక్కించేందుకు క‌ర‌ణ్ జోహార్ రెడీ అవుతున్నారు అన‌గానే ఫ్యాన్స్ లో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది.

ఈసారి కూడా గే ల‌వ్ స్టోరితో ఆడియెన్ కి అద్భుత‌మైన ట్రీటిస్తార‌ట‌. ఇప్ప‌టికే స్టోరీలైన్ ఫైన‌ల్ అయ్యింది. అన్న ప్రేమించిన `గే`తో చెల్లెలు ల‌వ్వాట ఆడుతుంద‌ట‌. ఆ ముగ్గురి మ‌ధ్యా ఏం జ‌రిగింది? అన్న‌దానిని ఫ‌న్నీ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌పై ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తోంది. ఇక అన్నా చెల్లెళ్ల పాత్ర‌లో క‌పూర్ ఫ్యామిలీ న‌ట‌వార‌సులు కార్తీక్ ఆర్య‌న్ (అనీల్ క‌పూర్ వార‌సుడు) - జాన్వీ క‌పూర్ (శ్రీ‌దేవి క‌పూర్ వార‌సురాలు) న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ ప్రేమించే కుర్రాడి (పాత్ర‌ధారి) కోసం ప్ర‌స్తుతం వెతుకుతున్నార‌ట‌.

అక్టోబ‌ర్ నుంచి `దోస్తానా 2`ని సెట్స్ పైకి తీసుకెళ‌తామ‌ని క‌ర‌ణ్ జోహార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ అన్నా చెల్లెళ్లు అయిన కార్తీక్ ఆర్య‌న్ .. జాన్వీ కూడా ఫుల్‌ బిజీ. కార్తీక్ ప్ర‌స్తుతం `ల‌వ్ ఆజ్ క‌ల్` సీక్వెల్ తో పాటు `ప‌తి ప‌త్ని ఔర్ వాహ్ ఇన్ ల‌క్నో` అనే రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అలాగే జాన్వీ రెండు సినిమాల‌తో బిజీ. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అధికారి గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్ లో న‌టిస్తూనే `రూహ్ అఫ్జా` అనే చిత్రంతోనూ బిజీగా ఉంది. ఇవ‌న్నీ సెప్టెంబ‌ర్ నాటికి పూర్త‌యిపోతాయ‌ట‌. అటుపై దోస్తానా 2 సెట్స్ లోకి జాయిన్ అవుతార‌ని తెలుస్తోంది. కార్తీక్ ఆర్య‌న్ `భూల్‌ బుల‌యా` సీక్వెల్ కి సంత‌కం చేశాడు. అది జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళుతుంది.