ఫైనల్ గా వారిద్దరితో 'మహాసముద్రం'

Wed Oct 16 2019 17:16:50 GMT+0530 (IST)

ఆర్ ఎక్స్ 100 అనే మొదటి చిత్రంతోనే దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్న వర్మ శిష్యుడు అజయ్ భూపతి రెండవ సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు. రెండవ సినిమాగా 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ ను ఎంచుకున్నాడు. రవితేజతో పాటు పలువురు స్టార్స్ ను మహాసముద్రం కోసం రవితేజ సంప్రదించాడు. ఒకరు ఇద్దరు ఓకే అన్నట్లుగా అన్నా ఆ తర్వాత సారీ చెప్పారు. దాంతో మహాసముద్రం కాస్త ఆలస్యం అవుతుంది.ఎట్టకేలకు మహాసముద్రం చిత్రం హీరోలు ఖరారు అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. స్టార్ హీరోలతో మహాసముద్రం చేయాలనుకున్న అజయ్ భూపతి ఆశ నెరవేరడం లేదు. అందుకే కొత్త వారితోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు గాను కార్తికేయ మరియు విశ్వక్ సేన్ లను ఎంపిక చేసుకున్నాడట. వీరిద్దరు కూడా అజయ్ భూపతి చెప్పిన మహాసముద్రం స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అతి త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతుంది.

అజయ్ భూపతి తన మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని ఎలా బోల్డ్ గా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడో 'మహాసముద్రం' చిత్రాన్ని కూడా అంతే బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించి మాస్ ఆడియన్స్ ను అలరించబోతున్నాడట. పెద్ద హీరోలతో అయితే కాస్త బోల్డ్ కంటెంట్ తగ్గించే వాడు. కాని కొత్త హీరోలు కనుక బోల్డ్ కంటెంట్ మొదటి సినిమా కంటే ఎక్కువగానే చూపించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.