కిక్కివ్వని 90ML..కిక్కు కోసం ప్రయత్నాలు!

Fri Oct 11 2019 07:00:01 GMT+0530 (IST)

Karthikeya On 90ML Movie

RX100' సినిమాతో సంచలన విజయం సాధించి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ.  ఎంతోమంది హీరోలు మొదటి హిట్ కోసం ఏళ్ళకొద్దీ తపిస్తుంటారు కానీ కార్తికేయకు అది ఆదిలోనే దక్కడం గొప్పవిషయమే. అయితే ఆ తర్వాత కార్తికేయ నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.  రీసెంట్ గా నాని 'గ్యాంగ్ లీడర్' లో విలన్ పాత్ర చేస్తే ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కార్తికేయ తన కొత్త సినిమా '90ML' పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.అయితే ఈ సినిమా విషయంలో కార్తికేయ టెన్షన్ పడుతున్నాడని ఇన్సైడ్ టాక్.  రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. ప్రస్తుతం ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉంది.  ఎడిటర్ తో కలిసి కూర్చుంటే కార్తికేయకు ఈ సినిమాలో కొన్ని సీన్స్ నచ్చడం లేదట. ఎలాగైనా హిట్ సాధించాల్సిన పరిస్థితిలో ఉన్న కార్తికేయ ఇలాంటి అవుట్ పుట్ తో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేడట.  ఇలానే ముందుకు వెళ్తే నష్టం జరుగుతుందనే ఆలోచనతో రీషూట్ కు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించిన కార్తికేయకు ఇప్పుడు కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేమాట అటుంచి ఒక్క హిట్ కోసం తపించాల్సిన పరిస్థితి వచ్చ్చిందని అంటున్నారు.  మరి ఈ సినిమాతో అయినా కార్తికేయ బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది వేచి చూడాలి.